కూలీలో ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా రెండేళ్లు ప్లాన్ చేశా.. లోకేష్ కనకరాజ్

డైరెక్టర్గా లోకేష్ కనకరాజుకు ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్‌.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ నెల 14న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. ఇందులో భాగంగానే లోకేష్ పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. మరోవైపు టీంతో కలిసి సరదా చిట్ చాట్ ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే.. సినిమాపై అంతకంతకు హైప్‌ పెరుగుతుంది. ఇక.. ఇందులో భాగంగానే తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. కూలి ఇంటర్వెల్ సీన్ ఆడియన్స్‌ రెస్పాన్స్ కోసం ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నా. రజినీకాంత్ సార్‌ని మొదటిసారి డైరెక్ట్‌ చేస్తున్నానంటూ.. ఇంటర్వెల్ బ్యాంగ్‌ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని ముందే నిర్ణయించుకున్న.. అందుకే దానికోసం దాదాపు రెండేళ్ల పాటు ప్లాన్ చేశా. ఈ సినిమాలో శృతిహాసన్ నటనను ఓ టైంలో రజిని సార్ కి చూపించా.. ఆ టైంలో ఏం మాట్లాడలేదు.

Lokesh Kanagaraj Believes in Time-Bound Productions

కానీ.. తర్వాతరోజు.. స్వీట్లు ఆర్డర్ చేసి మరి శృతికి గిఫ్ట్ చేశారు. శౌబిన్ షాహిర్ పర్ఫామెన్స్‌ను ఆయన తెగ మెచ్చుకున్నారు. ఎన్నో జ్ఞాపకాలు అందించిన ఈ సినిమా షూట్ పూర్తయిన రోజు చాలా ఫీలయ్యా అంటూ లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇక లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాలో విలన్ రోల్ కోసం నన్ను అప్రోచ్ అయ్యార‌ని చెప్పుకొచ్చాడు. ఈ క్ర‌మంలోనే డైరెక్టర్ సుధా కొంగరను రెండుసార్లు మీట్ అయ్యా అంటూ చెప్పుకొచ్చిన‌ లోకేష్.. ఆమె చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చేసింది. శివ కార్తికేయన్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు నటించాలని ఉంది కానీ.. కూలి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఉద్దేశంతో దానిని రిజెక్ట్ చేశా. కూలి కంప్లీట్ అయిన తర్వాత అరుణ్ మాదేశ్వర డైరెక్షన్ లో నటించేందుకు యాక్సెప్ట్ చేశా అంటూ వివరించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.