ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులుగా అడుగుపెట్టి.. స్టార్ట్ డైరెక్టర్‌లుగా తమని తాము ప్రూవ్ చేసుకోవాలని తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. ఆహార్నిశలు దానికోసమే శ్రమిస్తారు. వైవిధ్యమైన కథలతో, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్సఃను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. తన స్టైల్తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని.. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకడు. టాలీవుడ్ లో ఎన్నో క్రేజీ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హరీష్ శంకర్.. ఇటీవల తెరకెక్కించిన సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు.
ఇక.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే.. చాలా వరకు షూట్ పూర్తయిపోయిందట. అయితే.. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ చేయబోయే హీరో ఎవరు.. ఎలాంటి కథతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడని ఆశక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ఇక హరీష్ శంకర్ సినిమాలో మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే.. యూత్ ని కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఓ క్రేజి.. మాస్ హీరో నటించబోతున్నాడు అంటూ న్యూస్ మరింత వైరల్ గా మారుతుంది.
ఇప్పటికే ఆ హీరోకు స్టోరీ కూడా వినిపించేసాడట. ఆల్మోస్ట్ ఇది ఫైనలైజ్ అయిపోయినట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అఫీషియల్ గా ప్రకటించనున్నాడని తెలుస్తుంది. ఆ హీరో పేరు బయటకు రివీల్ కాకపోయినా.. మాస్ సినిమాల స్పెషల్ హీరో అంటూ టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఆ హీరో పలు ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నాడని.. ఆ సినిమా షూట్స్ అన్ని పూర్తయ్యాక.. హరీష్ శంకర్‌తో ఆ హీరో ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఇదే న్యూస్ సినీ వర్గాల్లో తెగ వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంగానే గబ్బర్ సింగ్‌ను మించిపోయే రేంజ్‌లో మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాడంటూ అభిమానులు సైతం నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.