టాలీవుడ్ బడా ఫ్యామిలీ.. అల్లు కుటుంబంలో ఇటీవల విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్మాత అల్లు అర్జున్ తల్లి అల్లు కనకరత్నం గత కొద్దిరోజులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ.. ఇటీవల స్వగృహములతో విశ్వాస విడిచారు. ఆమె మరణంతో అల్లు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలకు తీవ్ర విషాదం మిగిలింది. స్వయంగా చిరంజీవి అత్తగారే కావడంతో.. ఆమె మరణ వార్త విన్న వెంటనే ఆయన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. చివరి తంతు వరకు దగ్గరుండి అన్ని చూసుకున్నాడు చిరు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే.. కనకరత్నం గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ చేసిన ట్విట్ పై బన్నీ రియాక్ట్ అయ్యాడు.
ప్రస్తుతం ఇది హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరో మాత్రమే కాదు.. ఏపీ డిప్యూటీ సీఎం గాను విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రోజుల ముందు నుంచే వైజాగ్లో జనసేన సభను ఏర్పాటు చేసి అందులో బిజీగా గడుపుతున్న ఆయన.. అల్లు అరవింద్ ఇంట్లో ఉదయం సమయంలో కనిపించలేకపోయారు. అక్కడ సభ పూర్తి అయిన వెంటనే.. హైదరాబాద్ చేరుకొని డైరెక్ట్‌గా అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళాడు. పవన్ అక్కడికి వెళ్ళిన తర్వాత.. ఆయన బన్నీని కలిసిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా అత్తగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పవన్ ట్విట్ చేశాడు. అందులో శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారు కనుముసారని తెలిసి చాలా చింతిస్తున్న. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపించిన ఆమె.. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉండేది. తన కుమార్తె.. మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దిన శ్రీమతి కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అంటూ పవన్ ఆ నోట్ లో రాసుకోవచ్చారు. అల్లు అరవింద్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పెట్టిన ట్విట్‌కు బన్నీ రెస్పాండ్ అయ్యాడు. కళ్యాణ్ గారు మీ హృదయ పూర్వక ప్రార్థనలకు ధన్యవాదాలు అంటూ చెబుతునే.. చెన్నైనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికి మీ హృదయంలో అవి ప్రతిధ్వనిస్తున్నాయని తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. చిన్న అపార్థంతో మొదలైన గొడవలు.. ఇప్పటికైనా సర్దుమనిగాయని మెగా, అల్లు అభిమానులు ఆశిస్తున్నారు.