గత కొద్ది రోజుల్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టఫెస్ట్ వార్ మొదలవనుంది. కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రెండు బిగ్గెస్ట్ స్లార్ కాస్టింగ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో.. ఈ సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా సినిమా రిలీజ్‌కు వారం రోజులకు పైగానే సమయం ఉన్నా.. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెటర్లుగా ఒకదాన్ని మించి ఒకటి దూసుకుపోతున్నాయి.
నార్త్ అమెరికాతో పాటే.. యూకే, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లోనూ వార్ 2, కూలి సినిమాల అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతుంది. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ అమెరికాలో కూలీ, వార్ 2 సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర.. నువ్వా, నేనా అనేంతల స్ట్రాంగ్ గా తలపడుతున్నాయి. అమెరికా, కన్నడలో కూలి సినిమా ప్రీమియర్ షోలకు 1160 షో లను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తే.. వార్ 2 సినిమా 1600 షో లను ప్రదర్శించేందుకు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, హృతిక్ ఫాన్స్ కు షాక్ ఎదురయింది. తక్కువ ధియేటర్లే ఉన్నా రజిని కూలీ.. వార్ 2 సినిమాను గట్టిగా డామినేట్ చేస్తూ ట్రేడ్ వర్గాలకు షాక్ కలిగిస్తుంది. వార్ 2 సినిమా 45 వేలకు పైగా టికెట్లు నార్త్ అమెరికాలో అమ్ముడుపోయాయి. అయితే.. వార్ 2 సినిమాకు మాత్రం.. కేవలం 7కే టికెట్లు మాత్రమే అమ్మినట్లు పలు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కూలీ సినిమా ఇప్పటికే నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించి.. 2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇక వార్ 2 విషయానికి వస్తే.. కేవలం 7కే టికెట్లకు.. 250 కే డాలర్ల వసూళ్లను దక్కించుకుంది. తెలుగు వర్షన్ అడ్వాన్స్ బాగానే ఉన్నా హిందీ వర్షన్ అంతంత మాత్రం గానే ఉండడం అందరికీ షాక్ కలిగిస్తుంది. ఇక సినిమా కేవలం 5000 డాలర్లే వసూళ్లను దక్కించుకుంది. అయితే రానున్న రోజుల్లో హిందీ వర్షన్ టికెట్ల అమ్మకం పుంజుకోవడంతో పాటే.. తెలుగులోను భారీగా కలెక్షన్లు రావాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రీ సేల్స్ రిత్యా కూలీనే విన్నర్‌గా దూసుకుపోతుంది. మరి.. ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకు ఉంటాయో వేచి చూడాలి.