టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరో 13 రోజుల్లో గ్రాండ్ లెవెల్‌లో సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి వెండి తెరపై కనిపించిందే లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా భారీ లెవెల్ లో మెగా ట్రీట్ ఫ్యాన్స్ కు అందించనున్నాడట చిరు. ఇంతకీ.. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగా 157 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన అనిల్.. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తూ.. ఒక క్రేజీ పోస్టర్ రిలీజ్ చేయనున్నాడని సమాచారం. అంతేకాదు.. మెగాస్టార్ నటిస్తున్న మరో మూవీ విశ్వంభరా. వశిష్ట డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ బర్త్డే ట్రీట్ గా ఫ్యాన్స్ కు వశిష్ట అందించనున్నాడట. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ టీజర్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
అంతేకాదు.. వీటితో పట్టే గతంలో చిరుకి వాల్తేరు వైరయ్యతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబి డైరెక్షన్లో మరో మూవీ అఫీషియల్ గా ప్రకటించనున్నారని తెలుస్తుంది. అదే రోజు సినిమా ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు టాక్సిక్, జననాయగన్ లాంటి పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న కేవిఎన్ ప్రొడక్షన్స్ రూపొందించనుందట. ఇక కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వస్తున్న మొట్టమొదటి టాలీవుడ్ సినిమా కూడా ఇదే. ఇంకా.. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ స్టాలిన్ రీ రిలీజ్ కూడా టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పెద్ది టీం నుంచి చిరుకి గ్రాండ్ లెవెల్ లో విషెస్ తెలియజేస్తూ బుచ్చిబాబు స్పెషల్ పోస్టర్ను డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇలా చిరు బర్త్డే వరుస ట్రీట్లతో మెగాస్టార్ అభిమానుల ఫుల్ ఫీస్ట్ః ఉండనుందట.