టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఎలాంటి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్‌లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్. అయితే.. చిరు ఓ సినిమా విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేశాడట. పట్టుబట్టి మరి కమలహాసన్ ఉద్దేశించి రాసిన ఓ సినిమా కథను తానే చేశారు. ఇంతకీ ఆ సినిమా కథేంటో.. దాని రిసల్ట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఖైదీ సినిమా తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్, సాంగ్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ ఇలా అన్నిట్లోనూ తన మార్క్ క్రియేట్ చేసుకున్న చిరు.. ముఖ్యంగా మాస్ సాంగ్స్ తో ఆడియన్స్‌ను షేక్ చేశాడు.
అప్పట్లో చిరు సినిమాలంటే థియేటర్లో విజిల్స్ మోత మోగిపోయేది. ఈ క్రమంలోనే.. కమర్షియల్ హీరోగా తిరుగులేని ముద్ర పడిపోయింది. కానీ.. ఈ ఇమేజ్ నుంచి బయట పడేందుకు చిరు ఎమోషనల్ సినిమాలోను మెరిశాడు. శుభలేఖ, స్వయంకృషి లాంటి సినిమాల తర్వాత.. కే.విశ్వనాథ్ డైరెక్షన్‌లో చిరు ఆపద్బాంధవుడు సినిమా నటించిన సంగతి తెలిసిందే. వీళ్ళ కాంబోలో బచ్చిన మూడవ సినిమా ఇది. కాగా.. ఈ సినిమాను మొదట కమల్ తో చేయాలని విశ్వనాథ్ భావించాడట. అప్పుడు కమల్ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్‌ని మించిపోయిన స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. అంతేకాదు.. కమల్‌తో విశ్వనాథ్‌కు కూడా మంచిర్యాపో ఉంది. దీంతో.. అప్పటివరకు వీళ్ళ కాంబోలో అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్‌గా నిలిచాయి.
ఇక ఈ నేపథ్యంలోనే.. కమల్‌హాసన్ కోసం.. ఆపద్బాంధవుడు స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట విశ్వనాథ్. కాగా.. తన సినిమా కథల విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న చిరంజీవి.. కమల్ తో చేయడానికి ముందే.. విశ్వనాధ్, చిరంజీవి మధ్య చర్చలో ఈ స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేస్తుండగా.. ఈ స్క్రిప్ట్ లో కమల్ హాసన్ కాదు.. నేను చేస్తానని పట్టుపట్టాడట. ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో.. విశ్వనాథ్, చిరంజీవితో సినిమాను తెరకెక్కించారు. మీనాక్షి శేషాద్రి హీరోయిన్గా మెరిసిన సినిమా ఆధ్యాత్మిక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. భారీ అంచనాలు నడుమ 1992 అక్టోబర్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను దక్కించుకుంది. చిరంజీవిని ఇలాంటి ఫైట్, సాంగ్స్ ,డాన్స్ లేని సినిమాలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇక చిరు నటనకు మాత్రం నంది అవార్డు, ఇతర పురస్కారాలు దక్కాయి. అలా కమల్ చేయాల్సిన సినిమాను చిరు నటించిన ప్లాప్ అందుకున్నాడు. అయితే పలు అవార్డులను దక్కించుకుని రికార్డ్ సృష్టించాడు.