వార్నర్ బ్రదర్స్‌తో బన్నీ నయా మూవీ.. హాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కనా..!

ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న టాలీవుడ్ సినిమాలు అన్ని ప్రేక్ష‌కుల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ రిజల్ట్ అందుకుంటున్నాయి. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో తెలుగు సినిమా ఖ్యాతి మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే అదే రేంజ్‌లో మరోసారి.. టాలీవుడ్ సినిమా ఇమేజ్ రెట్టింపు చేసే ప్రాజెక్టులలో ఒకటిగా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పేరు తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మొదట్లోనే మేకర్స్ స్పెషల్ వీడియో ద్వారా అఫీషియల్ గా వెల్లడించారు. ఈ వీడియోకి సోషల్ మీడియా షేక్ అయింది అనడంలో సందేహం లేదు. హాలీవుడ్ తరహా భారీ స్టాండర్డ్స్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో తెర‌కెక్కించనున్నట్లు చిన్న ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ వీడియోతోనే క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్‌.

కేవలం అల్లు అర్జున్‌కు సంబంధించిన వీడియోనే కాదు.. హీరోయిన్ దీపిక పదుకొనేకు సంబంధించిన వీడియోస్ అయితే మంచి పాపులారిటీ దక్కించుకున్నాయి. అయితే.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాదు.. పాన్ వరల్డ్ మేకర్స్ చెప్పకనే చెప్పేస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ అనే హాలీవుడ్ సంస్థ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో సెన్సేషనల్ హాలీవుడ్ సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ‌.. ది బెస్ట్ యానిమేషన్, లైవ్ యానిమేషన్ సినిమాలన్నింటిని ప్రొడ్యూస్ చేశారు. అలాంటి సంస్థతో ఏఏ 22 మేకర్స్‌ చేతులు కలిపారని.. అల్లు అర్జున్, అట్లీ సినిమాను హాలీవుడ్‌లో గ్రాండ్‌గా వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా నిర్మిస్తున్న సంస్థ‌.. వార్న‌ర్‌ బ్రదర్స్‌తో చర్చలు కూడా పూర్తి చేశారట.

ఈ చర్చలు సక్సెస్ అయినట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే మెరుస్తుండగా.. రష్మిక మందన విలన్ పాత్రలో కనిపించనుందట. అంతేకాదు.. సినిమాలో మృణాల్‌ ఠాగూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ కూడా మెర‌వ‌నున్నట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ ఏకంగా మూడు పాత్రలో మెరవనున్నాడని తెలుస్తుంది. ఇక రెండు ప్రపంచాలకు సంబంధించిన స్టోరీగా ఇది రూపొందుతుందని.. అల్లు అర్జున్ చేస్తున్న మూడు క్యారెక్టర్ లో ఒకటి సూపర్ హీరో రోల్ అంటూ.. సినిమా కాన్సెప్ట్ ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరు చూడని రేంజ్ లో ఉంటుందని టాక్. ఖచ్చితంగా హాలీవుడ్ సినిమాలకు ఇది గట్టి పోటీనే అంటూ.. హాలీవుడ్ బాక్సాఫీస్‌ను సినిమా బ్లాస్ట్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.