బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఈసారి గ్యాంగ్ స్టార్ గా చిరు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దగ్గర పడుతున్న క్రమంలో ఆయన సినిమాలపై వరుస అప్డేట్స్ కోసం అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు బర్త్డే కానుకగా త్వరలోనే ఆయన నుంచి విశ్వంభర టీజర్ రిలీజ్‌ చేయనున్నారు. అలాగే.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరు నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ రిలీజ్ కూడా అదే రోజున ఫిక్స్ చేశారు మేకర్స్‌. ఈ రెండింటితో పాటే మరో బిగ్ స్పెషల్ బడా సర్ప్రైజ్ సిద్ధంగా ఉందంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

అదేంటంటే.. బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ మరోసారి నటించ‌నున్నాడ‌ట‌. ఇప్పటికే ఈ కాంబో నుంచి ఓ సినిమా వచ్చి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పై ఆసక్తి అభిమానుల మొదలైంది. మెగాస్టార్ ఈ సినిమాతో పూర్తిస్థాయి గ్యాంగ్‌స్ట‌ర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఈ పాత్రతో స్క్రీన్ పై చిరు నిప్పులు పుట్టించడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

After Balayya, He Is Back With Chiranjeevi! | After Balayya, He Is Back  With Chiranjeevi!

ఇక ఈ భారీ ప్రాజెక్టును ఏబీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాను సైతం చిరంజీవి పుట్టిన రోజున లాంచ్ చేసే అవకాశం ఉందట. మెగాస్టార్ చిరు బర్త్డే మరి రెండు రోజులు మాత్రమే స‌మ‌యం ఉంది. ఈ క్ర‌మంలోనే బర్త్‌డే రోజున వచ్చే ఈ వరుస సర్ప్రైజ్‌ల‌తో మెగా ఫ్యాన్స్ కు పండగ వాతావరణం నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.