టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుని దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీని ఏలేసిన సీనియర్ ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది ఇటీవల కాలంలో వరుస పెట్టి సినిమాలను తగ్గించేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఇతర ఇండస్ట్రీలో సినిమాలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం పూర్తిగా దూరమవుతున్న పరిస్థితి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు.. ఒకసారి తెలుసుకుందాం.
అనుష్క:
ఈ లిస్ట్‌లో మొదట అనుష్క పేరు వినిపిస్తుంది. టాలీవుడ్లో అదిరిపోయే క్రేజ్ కలిగిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. చాలా కాలం పాటు టాలీవుడ్ ను శాసించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో మెరిసింది. అయితే.. టాలీవుడ్‌కు మాత్రం చాలా కాలంగా దూరంగానే ఉంటుంది. వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరించే పరిస్థితి లేదు. ఇక ప్రస్తుతం ఘాటి లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మరే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
కాజల్ అగర్వాల్:
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సైతం ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది. అడపా దడపా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తుంది. ఊహించిన రేంజ్ లో అవకాశాలు దక్కించుకోలేకపోతుంది.
సమంత:
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. దాదాపు తను నటించిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంది. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారింది. ఇక సమంత ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరమైంది. బాలీవుడ్ లో మాత్రమే అది కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తుంది. ఇక వీళ్ళతో పాటే.. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సక్సెస్ లో అందుకొని క్షణం తీరిక లేకుండా గడిపిన రకుల్ ప్రీత్, తమన్న సైతం సినిమాలకు దూరం అవుతున్నారు.