టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపాదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఐదు దశాబ్దల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు చిరు. ఇక.. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందునున్న ఈ సినిమాతో వింటేజ్ చిరును మళ్ళీ చూడబోతున్నామని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. చిరంజీవి సైతం ఈ సినిమాతో తనను తాను మరోసారి గ్రాండ్ లెవెల్ లో ఎలివేట్ చేసుకున్నే ప్రయత్నాల్లో ఉన్నాడట.
రీ ఎంట్రీ తర్వాత.. ఒక్కసారైనా సక్సెస్ కూడా లేక సతమతమవుతున్న చిరు.. వాల్తేరు వీరయ్యతో ఓ మాదిరి హిట్ అందుకున్నా.. అది ఆయన రేంజ్‌కు తగ్గ సక్సెస్ అయితే కాదు. ఈ క్రమంలోనే.. అనిల్ రావిపూడి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే.. సినిమా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు చిరు. ఇక చిరు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందన్నడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే.. అది చాలా హెల్ప్ అవనుందని సమాచారం. ఇక.. ఈ సినిమాలో చిరంజీవి గత సినిమా అయినా దొంగ మొగుడు నుంచి.. మెగా 157 కోసం ఓ హైలెట్ సీన్ రీ క్రియేట్ చేయనున్నారని సమాచారం.
అంతేకాదు.. సినిమాలో చిరంజీవి చాలా కామెడీ యాంగిల్లో మెరువనున్నారని.. ఆడియన్స్‌ను కడపుబ్బ నవ్వించడం ఖాయం అంటూ టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్‌లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అనిల్ మాత్రం స్ట్రాంగ్ ధీమాతో ఉన్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మూడు స్కెడ్యూలను పూర్తి చేసిన టీం.. త్వరలోనే నాలుగు షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల బిజీ కావాలని చూస్తున్నారు. 2026 సంక్రాంతి బాలు సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుందట. మరి.. అనిల్ అనుకున్న టైం కు సినిమాను రిలీజ్ చేయగలుగుతాడా.. లేదా.. వేచి చూడాలి.