గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా అఖండ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై పీక్స్ లెవెల్లో అంచనాలు మొదలయ్యాయి. బాలయ్య లుక్, టీజర్.. ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెల్ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్లతో బాలయ్య ఫ్యాన్స్ కు ఊర మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే.. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతుంది అని అంతా భావించినా.. కొన్ని కారణాలతో సినిమాను వాయిదా వేశారు. అఫీషియల్ గా దీన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ వాయిదా పడిన సినిమా మాత్రం బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది.
ఈ క్రమంలోనే సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్ స్టార్‌లు పోటీ పడుతున్నాయట. ఈ క్రమంలోనే జియో హాట్స్టార్ భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.85 కోట్లకు ఈ డీల్ కుదిరిందని టాక్ నడుస్తుంది. సంక్రాంతికి అందుబాటులో ఉండేలా.. డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేయాలని ఓటీటీ పార్ట్‌నర్స్ డిమాండ్ చేశారట. ఇక రూ.85 కోట్లకు రైట్స్ అమ్ముడుపోవడం అంటే ఇటీవల కాలంలో తెలుగు సినిమాకు జరిగిన అతిపెద్ద డీల్ ఇదే అవుతుంది.
బాలయ్య కెరీర్‌లో ఆయన సినిమాకు వచ్చిన అతిపెద్ద డీల్ కూడా ఇదే అనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు టీం. 14 ప్లస్ బ్యానర్ పై మయ్ తేజస్విని సమర్పణలో.. రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పిన్నిశెట్టి విలన్ పాత్రలో మెరవనున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న బాలయ్య సినిమా కావడంతో.. ఈ సినిమాపై మొదటి నుంచి పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ రిలీజై ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో.. పాన్ ఇండియా లెవెల్లో బాలయ్యకు ఎలాంటి మార్కెట్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.