బాలయ్య ఫ్యాన్స్ కు మెంటలెక్కించే అప్డేట్.. రెండు కాలాలు, రెండు కోణాలతో.. సరికొత్త స్టోరీ

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియన్ సినిమా కావడంతో.. సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు.. టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ మంచి బజ్‌ క్రియేట్ అయింది. ఇక.. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటూ బాలయ్య అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Nandamuri Balakrishna's 'Akhanda' to get a Hindi remake? | Telugu Movie  News - Times of India

ఇలాంటి క్ర‌మంలో తాజాగా.. అభిమానులకు ఫుల్ ట్రీట్‌ ఇచ్చే మ‌రో అప్డేట్ వైరల్‌గా మారుతుంది. బాలయ్య.. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో వీర సింహారెడ్డి సినిమా తెర‌కెక్కి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిల్లారు.. ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. చరిత్రను వర్తమానాన్ని ముడపెడుతూ ఈ సినిమా వినూత్నమైన ఎపిక్ స్టోరీతో.. ఆడియన్స్‌ను పలకరించినందుట.

Gopichand Malineni in search of right match for Balakrishna -  TeluguBulletin.com

ఇప్పటికే దీనికి తగ్గట్టు అన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. కధాంశానికి తగ్గట్టుగానే బాలయ్య రెండు పవర్ఫుల్ పాత్రల్లో.. రెండు డిఫరెంట్ కోణాల్లో ఆడియన్స్‌కు కనువిందు చేయనున్నాడని.. ఈ సినిమాతో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ పక్కా అంటూ తెలుస్తుంది. లుక్.. కూడా చాలా వైవిధ్యంగా ఉండనుందని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో యాక్షన్స్ స‌న్నివేశాలు భారీ లెవెల్లో ఉండనున్నాయని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్‌ బిజీగా ఉన్నారట. సినిమా షూట్ నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.