టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని.. ప్రస్తుతం వార్ 2 సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. గ్రాండ్ లెవెల్ లో ఆగష్టు 14న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్‌ను రీసెంట్గా పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తూ రిలీజ్ చేశారు. అయితే.. రీసెంట్గా తారక్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేయడం విశేషం. కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఆయన స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇది గొప్ప విషయం ఏం కాదు. గతంలో దేవర, ఆర్‌ఆర్ఆర్ సినిమాలకు సైతం ఆయన ఐదు భాషల్లోనూ తన డబ్బింగ్ తానే పూర్తి చేశాడు.
ఆర్‌ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చరణ్ కూడా అదే పని చేశారు. మరి వార్ 2లో ఎన్టీఆర్‌తో కలిసి చేసిన హృతిక్ కూడా ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్తాడా.. లేదా అనే ఆసక్తి ప్రస్తుతం నెటిజన్లలో నెలకొంది. అన్ని భాషల్లో కలెక్షన్లు కావాలి అంటే అన్ని భాషలపైన తనకి గౌరవం కూడా ఉండాలి కదా మరి. హృతిక్ తన తోటి హీరో చేసినట్లే తాను కూడా మిగతా 5 భాషల్లోనూ డబ్బింగ్ చేస్తాడా.. లేదా అనే సందేహాలను హృతిక్‌ను ట్యాగ్ చేసి మరి ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి ఆయనే.. ఈ ఐదు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేస్తాడో.. లేదో.. వేచి చూడాలి. ఇక రీసెంట్గా సినిమాల్లో చివరి పాటను షూట్ చేశారు. ఇప్పటికి వార్ 2 సినిమాకి తెలుగులో భారీ క్రేజ్ నెలకొంది.
ఈ సాంగ్ కారణంగా సినిమాపై మరింత బజ్ ఏర్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. ఇప్పటికే సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని సీతారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత సూర్యదేవరన నాగవంశీ సొంతం చేస్తున్నట్లు టాక్. అది కూడా చాలా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడంటూ న్యూస్ వైరల్ అవ్వడంతో ఇది సినిమాకు మించిన ఖర్చు అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ డైరెక్ట్ తెలుగు సినిమా అయితే ఇంత పెట్టడంలో తప్పులేదు. కానీ.. హిందీ డబ్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ అంటే పెద్ద రిస్కే అవుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. వార్ 2 సినిమా రిలీజ్ రోజునే రజినీకాంత్ కూలీ సినిమా సైతం రిలీజ్ కానుంది. కూలికి ప్రస్తుతం తెలుగులో వార్ 2 కంటే ఎక్కువ హైప్ ఉన్న క్రమంలో.. రాబోయే రోజుల్లో సినిమా ఏ రేంజ్‌లో రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.