ఒకే కథను తిప్పితిప్పి త్రివిక్రమ్ ఇన్ని సినిమాలు తీశాడా.. అసలు ఊహించలేరు..?

టాలీవుడ్ మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డైలాగ్ రైటింగ్, స్క్రీన్ ప్లేకు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఉంది. ఈ క్రమంలోనే అభిమానులు త్రివిక్రమ్‌ను ముద్దుగా గురూజీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. చాలా సినిమాల్లో తిప్పితిప్పి అదే కథ‌ను చూపిస్తాడంటూ విమర్శలను సైతం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఆ సినిమాలన్నీ మంచి సక్సెస్లు కూడా దక్కించుకుంటాయి. అలా.. ఇప్పటివరకు ఫ్యామిలీ నుంచి ఓ వ్యక్తి దూరమైపోవడం.. మళ్లీ తిరిగి వచ్చి అదే కుటుంబంలో కలిసి ఆ కుటుంబ సమస్యలను తీర్చి హ్యాపీ లైఫ్ లీడ్‌ చేయడం.. ఇదే కథతో ఎన్నో సినిమాలు తెర‌కెక్కించి ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు.

ఉదాహరణకు.. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అలవైకుంటపురంలో, గుంటూరు కారం ఈ సినిమాలన్నీటిని అబ్జర్వ్ చేస్తే.. మేటర్ క్లియర్ గా అర్థమవుతుంది. త్రివిక్రమ్ సినిమాల్లో లవ్, ఫ్యామిలీ లైఫ్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఎమోష‌న్స్‌ ప్రధాన అంశాలుగా చూపిస్తూ పాత్రలకు కనెక్ట్ అయ్యేలా చేసుకుంటాడు. ఈ క్రమంలోనే మంచి సక్సెస్‌లు అందుకుంటున్నారు. అయితే.. కథపరంగా వైవిధ్యతను చూపించడంలో మాత్రం ఆయన ఫెయిల్ అవుతూ వస్తున్నాడంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. అంతేకాదు.. ఇప్పటివరకు తెర‌కెక్కించిన పలు సినిమాల్లో కథంశాలను.. ఇతర సినిమాలు లేదా నవలలనుంచి కాపీ చేసారని.. అదే కథను డెవలప్ చేసి సినిమాగా రూపొందించాడనే విమర్శలు కూడా వచ్చాయి.

అయితే.. కథ ఒకే థీం చుట్టూ తిరిగినా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే విధానం, సంభాషణ, పాత్రల డిజైనింగ్, ఎంటర్టైన్మెంట్ అంశాల కోణంలో వైవిధ్యత చూపిస్తూ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. ఇక.. ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందుతున్నాయి. ఇక.. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న త్రివిక్రమ్.. చివరగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాను రూపొందించారు. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. ఇప్పటికి.. త్రివిక్రమ్ సినిమా వస్తే థియేటర్లకు వెళ్లి మరీ చూడడానికి ఎంత మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.