సుక్కు స్ట్రాటజీలను ఫాలో అవుతున్న టాప్ డైరెక్టర్స్..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. క‌థ‌ ఏదైనా సరే బలమైన ఎమోషన్స్ కు యాక్షన్ జోడించి హీరోని ఎలివేట్ చేయడంలో తన మార్క్ చూపిస్తున్నాడు సుక్కు. ఈ క్రమంలోనే తను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా.. తన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ హైలెట్ చేస్తూ హీరో యాక్షన్‌కు అర్థం వచ్చేలా కథను డిజైన్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్‌ చేసిన ఈ లెక్కల మాస్టర్.. గతంలో నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్పా సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో చూసాం. హీరోకు ఓ చోట అవ‌మానం జరగడం.. తన జీవితంలో ఒకదాని సాధించాలనే కసితో విల్లన్లపై పోరాడడం.. ప్రతి సినిమాలో ఇది కచ్చితంగా ఉంటుంది.

Sukumar Working Things For Buchi Babu?

ఏ సినిమా అయినా సరే హీరోని ముందు ఒక బాధితుడుగా చూపించి.. ఆ బాధతో విలన్లతో ఫైట్ చేసి నెగ్గడాన్ని సాటిస్ఫైంగ్‌గా చూపిస్తాడు సుకుమార్‌. ఈ క్రమంలోనే సినిమాలో యాక్షన్ అసలు ఎక్కడ బోర్ కొట్టిన ఫీల్ కలగదు. హీరో గెలిస్తే ఆడియన్స్ తాము గెలిచిన‌ట్లు ఫీల్ అయ్యేలా సుకుమార్ కథను డిజైన్ చేస్తాడు. ఇదే ఎమోషన్.. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంతో మంది టాప్ డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు. ఇప్పటికే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. రామ్ చరణ్తో చేస్తున్న పెద్ది సినిమాల్లో ఇదే స్ట్రాటజీని వాడబోతున్నాడని సమాచారం. స్ట్రాంగ్ ఎమోషన్‌ను జోడించి యాక్షన్ ట‌చ్‌తో జ‌నాని ఆక‌ట్టుకోనున్నాడట.

అలాగే.. నానితో శ్రీకాంత్ ఓద్దెల తీస్తున్న ది పారడైజ్ సినిమా కూడా ఉండనుందని సమాచారం. అంతే కాదు.. గౌతం తిన్న‌నూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా సైతం అన్నదమ్ముల ఎమోషన్తో కూడిన సినిమా అని.. యాక్షన్ సైతం అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్‌ ఇలాంటి ఎమోషన్స్ ను తన ప్రతి సినిమాలో చూపిస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాల సైతం అలాంటి ఎమోషన్స్ ఉన్నాయ‌ని టాక్‌. హీరోకి ఒక సెంటిమెంట్ ను కనెక్ట్ చేసి ప్రేక్షకులను ఆ మోడ్ లోకి తీసుకువెళ్లి.. సరైన సమయంలో యాక్షన్ మోడ్ తో ఆడియన్స్‌కు కనెక్ట్ చేస్తాడు. దీంతో ఇప్పుడు మిగతా డైరెక్టర్లు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ హీరోల పాత్రలకు ఎమోషన్స్ జోడిస్తున్నారు.