కోలీవుడ‌్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ కల్ట్ మూవీగా నిలిచిన సినిమాల్లో భాష ఒకటి. డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైలర్ గా తెరకెక్కి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ సినిమా.. సీక్వెల్‌ను ఓ టాలీవుడ్ డైరెక్టర్ చేయాలని ఎంతగానో కష్టపడ్డాడట. దానికి తగ్గట్టుగా అన్ని ప్లాన్స్ చేసుకున్నాడట. ఇంతకీ ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరు..? అసలు అది ఆగిపోవడానికి గల కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసారతో టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు వశిష్ఠ.
అయితే ఈ సినిమా తర్వాత.. వశిష్ట మెగాస్టార్ చిరుతో సినిమాను తెరకెక్కించే.. జాక్పాట్ ఆఫర్‌ను కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబోలో విశ్వంభర సినిమా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ కారణంగా.. విశ్వంభర ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా వశిష్ట ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వశిష్ట రజనీకాంత్ కు కూడా ఒక కథ చెప్పానని.. ఆయన కూడా ఒప్పుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. కథ కంప్లీట్ అయిన తర్వాత రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్లి వినిపించానని.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. బింబిసారా సినిమా చూసి ఆయన స్వయంగా కాల్ చేసి అభినందించారు.. నా స్టోరీలో కొన్ని చేంజెస్ చెప్పారు అంటూ చెప్పుకొచ్చాడు.
అది భాషకి సీక్వెలాంటి మూవీ. అయితే.. నాకే సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా అనిపించలేదు. వెంటనే దిల్ రాజు గారికి చెప్పేసా. కథ పర్ఫెక్ట్‌గా లేకుండా.. రజనీకాంత్ గారితో ముందుకు వెళ్లకూడదని చెప్పేసా. తర్వాత.. ఆయనను కలిస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని.. మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పారు. దాంతో కథ ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. తర్వాత నిర్మాత విక్కీ ద్వారా చిరు గారిని కలిసి విశ్వంభర స్టోరీ చెప్పి ఓకే చేపించుకున్న అంటూ వివరించాడు. దీనిబట్టి.. రజనీకాంత్ సినిమాను వాయిదా వేశారు కానీ.. నో చెప్పేయలేదు. ఈ క్రమంలోనే వశిష్ట సైతం కొన్ని చేంజెస్ చేసి కథ సిద్ధం చేశారు. మరి ఫ్యూచర్లో అయినా రజినీకాంత్ వశిష్ఠతో ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొస్తాడేమో వేచి చూడాలి.