చిరు ” విశ్వంభర “కు లైన్ క్లియర్.. పవన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మ‌ల్లిడి వ‌శిష్ఠ‌ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ విశ్వంభ‌ర. అంజీ సినిమా తర్వాత చాలా కాలానికి చిరు నుంచి భారీ గ్రాఫిక్స్‌తో వ‌స్తున్న మూవీ కావ‌డంతో మొద‌ట్లో ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. అయితే.. గతంలో రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలన్నీ తలకిందులు చేశారు మేకర్స్‌. కారణం గ్రాఫిక్స్ కంటెంట్ నాసిరకంగా ఉండటమే. ఈ క్రమంలోనే విశ్వంభర టీజర్ కట్స్ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో.. ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న మేకర్స్.. వెంటనే గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేసి.. సరికొత్త టీంతో రీ వర్క్ ప్రారంభించారు. ఇక దానికి అనుకున్న సమయం కంటే మరింత టైం పట్టింది.

ఎప్పుడో జనవరిలో రిలీజ్ కావాల్సిన సినిమా అసలు ఈ ఏడాది రిలీజ్ అవుతుందా.. లేదా.. అనే సందేహాలు కూడా అభిమానుల్లో మొదలయ్యాయి. సినిమాలో గ్రాఫిక్స్ కంటెంట్ దాదాపు 45 నిమిషాలు ఉంటుందట. ఈ క్రమంలోనే.. మళ్లీ గ్రాఫిక్స్ వర్క్ అంతటిని రిపేర్ చేశారు టీం. ఇక ఈ రీ వర్క్‌ను తాజాగా చిరంజీవి వీక్షించాడట. కంటెంట్ ఆయనకు బాగా నచ్చి వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ విఎఫ్‌ఎక్స్ కంటెంట్ లాక్ అయిందట. ఇక సినిమా ఓటీటీ డీల్ కూడా ముగిసి చాలాకాలం అవుతుంది. ఇక సినిమా షూట్ మొత్తం ఆల్మోస్ట్ ముగిసిపోయింది. ఒక్క స్పెషల్ ఐటమ్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. అయితే.. సినిమా మొత్తానికి మ్యూజిక్ ఆల్బమ్స్ కీరవాణి సిద్ధం చేయగా.. ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. సాంగ్ కాస్త ఆలస్యమవుతుంది.

Pawan Kalyan OG Release Date Announced | cinejosh.com

ఇక‌ సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయనున్నట్లు టాక్. అయితే.. ఇప్పటికే పవన్.. ఓజి సంక్రాంతిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. విశ్వంభర సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేయడంతో ఓజీ సినిమాను వాయిదా వేసే అవకాశం ఉందని టాక్. దీంతో పవన్ అభిమానులకు నిరాశ తప్పదంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి సినిమా అయినా సరే ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకునే పరిస్థితులు లేవు. కానీ.. ఇప్పటికే విశ్వంభర రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చిన క్రమంలో.. ఈ ఏడాది మిస్ అయితే మళ్ళీ వచ్చే ఏడాది సమ్మర్ వరకు విశ్వంభ‌రకు సరైన ఫ్లాట్ ఫామ్ దొరకడం లేదు. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఓజి టీంను కన్విన్స్ చేసి.. మెగాస్టార్ విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడని టాక్. ఇందులో వాస్తవంతో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.