ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుని పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న హీరోలు సైతం ఇతర సినిమాలలో నెగిటివ్ షెడ్‌లలో విలన్ పాత్రలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెంటనే అలాంటి అవకాశం వస్తే ఫ్రేమ్ గురించి ఆలోచించకుండా కమిట్ అయిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వారు టాలీవుడ్‌కు విలన్‌లుగా అడుగుపెట్టి ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ హీరోలు సైతం ఇతర ఇండస్ట్రీలో నెగటివ్ షేడ్స్‌లో నటించేందుకు ఒప్పుకుంటూ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. తాజాగా.. ధనుష్ కుబేర సినిమా కోసం అక్కినేని నాగార్జున నెగటివ్ షేడ్స్‌లో నటించిన సంగతి తెలిసిందే.
అయితే.. ప్రారంభంలో నాగార్జున తీసుకున్న ఈ డెసిషన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌గా నిలిచింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో వెళ్తున్నారంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. తాజాగా.. తారక్ బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వార్ 2లో నటించిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, తారక్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. యష్‌స్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందింది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ల మధ్యన ఉండే ఫైట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని.. ఇద్దరు హీరోల పర్ఫామెన్స్ హైలెట్ గా నిలవబోతుందంటూ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో అర్థమైపోయింది. ఇక ఈ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో తారక్ కనిపించనున్నాడు.
ఈ క్రమంలోనే తారక్ అభిమానులతో పాటు.. పలువురు సినీ పెద్దల సైతం ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇలాంటి క్రమంలో వార్ 2 రిలీజ్ కానే లేదు. రిజల్ట్ ఇంకా రాలేదు. మళ్లీ ఎన్టీఆర్ ఇంకో బిగ్ రిస్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆయన మరో బాలీవుడ్ సినిమాలో విలన్ షెడ్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తర్వాత ప్రాజెక్టులో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో మెరవనున్నాడట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పై పూర్తి వ్యతిరేకత మొదలైంది. ఎన్టీఆర్ డెసిషన్‌ను తప్పు పెడుతున్నారు. దయచేసి ఇలాంటి రిస్క్ చేయొద్దంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వార్ 2 సినిమా రిలీజ్ తర్వాత ఈ నెగటివ్ రోల్ విషయంలో తారక్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.