బాలీవుడ్‌కు తారక్ బిగ్ షాక్..!

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇవ్వ‌నున్నాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ఆ క్రేజ్‌ సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా చేయకుండా లేట్ చేస్తూవచ్చాడు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా క్రేజ్‌ కూడా తగ్గుతూ వచ్చింది. ఈ లోగా.. ఐకాన్ స్టార్ పుష్ప, పుష్ప 2తో నార్త్ ఇండియలో సైతం జండా స్ట్రాంగ్‌గా పాతేశాడు. భారీ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు. దీంతో తారక్ రేసులో మరింత వెనుకబడిపోయాడు. ఈ క్రమంలోనే.. మళ్లీ అలా కాకుండా ఉండేందుకు జాగ్రత్తగా ప్రణాళికలు రచిస్తున్నాడు. వరుసగా అన్ని పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిస్తున్నాడు.

అలా.. ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికంటే ముందు దేవర ని రెండు భాగాలుగా కాకుండా మొత్తం ఒకే కథగా.. సినిమా తీసి ఉంటే కచ్చితంగా మార్కెట్ పెరిగేది. క్రేజ్ కూడా బ్యాలెన్స్ అవుతూ వచ్చేది. కానీ.. సినిమాను రెండు పార్ట్‌లుగా చేయడంతో కథ అందరికీ ఎక్కలేదు. తనకున్న క్రేజ్ తో మెల్లగా దేవర నుంచి గట్టెక్కిన తారక్.. వార్ 2, డ్రాగన్ సినిమాలతో ఎలాగైనా స‌త్తా చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మూడు దేశాలను గడగడ లాడించే డ్రగ్స్ స్మగ్లర్ కథతో డ్రాగన్ సినిమా రూపొందనుందని సమాచారం.

Jr NTR-Prashanth Neel's film titled 'Dragon'? Distributor's comments spark  speculation | - The Times of India

వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత నెల్సన్ దిలీప్‌తో మరో సినిమా చేయనున్నాడు. అనూహ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరో ప్రాజెక్టులో తారక్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవిత చ‌రిత్ర‌లో ఎవరికి తెలియని ఒక కథను త్రివిక్రమ్ సినిమాగా రూపొందించ‌నున్నాడు. భారీ బడ్జెట్తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా సెట్స్‌పైకి కూడా రాకముందే ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. ఈ సినిమా తర్వాత ఏం చేస్తాడని వాటిపై క్లారిటీ లేదు. వరుసగా భారీ బడ్జెట్ పాన్‌ ఇండియా సినిమాలలో నటిస్తూ తన జండా భారతదేశంలో స్ట్రాంగ్ గా పాతేయాలని ఫిక్స్ అయ్యాడు తారక్. ఈ క్రమంలోనే బాలీవుడ్ ను బ్లాస్ట్ చేయాలని ఉద్దేశంతో తారక్‌ మరో స్ట్రైట్ బాలీవుడ్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రివిల్ కావాల్సి ఉంది.