టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. టాలెంట్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ఫ్రాంచైజ్‌లతో పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చాటుకున్న సుక్కు.. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో దాదాపు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఖాతాలో వేసుకున్నాడు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లి డైరెక్షన్లో ఓ సినిమాకు సిద్ధంకాగా.. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబో మూవీ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే.. ఈ సినిమా రంగస్థలం 2గా.. అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతుందని టాక్.
ఇలాంటి క్రమంలో సుకుమార్.. రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయడం కంటే ముందే.. మరో హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. అసలు మేటర్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. ఓస్.. బన్నీ నే మరోసారి సుక్కు డైరెక్ట్ చేయబోతున్నాడట. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. సుకుమార్, బన్నీతో సినిమా కాదు.. ఒక యాడ్ ని షూట్ చేయనున్నాడట. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ఎన్నో బ్రాండ్ ప్రొడక్ట్స్ ను భారీ లెవెల్ లో ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్.. తాజాగా ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఆ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ కాగా.. డైరెక్టర్గా సుకుమార్ వ్యవహరించనునట్లు టాక్ తెగ వైరల్‌గా మారుతుంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. చరణ్, సుకుమార్ కాంబో మూవీ సెట్స్ పైకి రాకముందే సుకుమార్ మరోసారి అల్లు అర్జున్‌ని బ్రాండ్ ప్రమోషన్ కోసం డైరెక్ట్ చేయనున్నాడు. దీంతో.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ప్రస్తుతం తెగ ట్రెండింగ్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ మూవీ సెట్స్‌లో చెర్రీ అడుగుపెట్టనున్నాడు.