టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాల లైనప్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లో హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పవన్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల విషయంలో ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు షూట్ పూర్తి అవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఈ రెండు సినిమాలపై ఫ్యాన్స్ ఇదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది.
హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో.. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ రాశిఖన్నా కూడా నటిస్తుందంటూ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. తాజాగా మేకర్స్ దానిపై అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. రాశిఖన్నా ఫస్ట్ లుక్ ను అధికారికంగా అభిమానులతో పంచుకున్నారు. ఆమె సినిమాలో ఓ కీలక పాత్రలో పోషిస్తుందన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ.. సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశారు. ఇక.. ఈ సినిమాలో రాశి కన్నా శ్లోకా అనే పాత్రలో మెరువనుంది. ఫోటోగ్రాఫర్ గా కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
కాగా.. ఈ పోస్టర్‌తో ఆమె పాత్ర సినిమాలో స్పెషల్ ఇమేజ్ కలిగి ఉందని టాక్ వైరల్ గా మారుతుంది. ఇక గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి ఎలాంటి సెన్సేషనల్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్‌పై కూడా మొదటి నుంచి ఫ్యాన్స్ లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ మాస్ స్టైల్ తో.. హరీష్ శంకర్ మాస్ ట్రీట్మెంట్తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ వ్యవహరిస్తుండగా.. సినిమా సాంగ్స్ పై కూడా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన మిగిలిన క్యాస్టింగ్ వివరాలు, టీజర్ ట్రైలర్ అప్డేట్స్, మేకర్స్ త్వరలో షేర్ చేసుకునే అవకాశం ఉంది.