పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మరో పక్కన తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు.. మొదట క్రిష్ దర్శకత్వం వహించగా తర్వాత జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు.. టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఏ హీరోలకి లేని రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక ప్రస్తుతం పూర్తి చేసిన హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 24 గంటల్లో ఏకంగా 48 మిలియన్ వ్యూస్ సంపాదించుకునే పుష్ప 2 రికార్డులను సైతం బ్రేక్ చేసింది. అంతేకాదు.. ట్రైలర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ లెక్కలపై ఆశక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా మొదలయ్య ఏళ్ళు గడుస్తున్న నేపథ్యంలో.. బడ్జెట్ కూడా భారీగానే అయింది. ఇక పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ హీరోగా నటించిందే లేదు. ఈ సినిమాతో మొదటిసారి తనని తాను పాన్ ఇండియన్ హీరోగా రిప్రజెంట్ చేసుకోబోతున్నాడు.
ఇలాంటి క్రమంలో పవన్ ఎలాంటి ఇమేజ్ దక్కించుకుంటాడు.. తనకంటూ ఒక్క సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడా.. లేదా.. అనే అంశాలు అందరిలోనూ ఆసక్తిగా మారాయి. ఇక తాజా సమాచారం ప్రకారం.. సినిమా దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందట. ఇక లాంగ్‌రన్‌లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఎలాంటి సందేహం లేకుండా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు బాటలోకి వెళ్తుంది. కానీ.. సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం రూ.150 కోట్లను మించి కలెక్షన్లు రాబట్టడం కూడా కష్టమే. ఇక రూ.250 కోట్లకు మించి కలెక్షన్లు వస్తేనే సినిమా హిట్ లిస్ట్ లోకి వెళ్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి 20 రోజుల్లో రిలీజ్ అవునున్న ఈ సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో వేచి చూడాలి.