ఓజీ వర్సెస్ అఖండ 2: బాలయ్యకు ఎక్కువ ఛాన్స్.. పవన్ లైన్ క్లియర్..!

ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ.. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ బ‌జ్‌ నెలకొన్న సినిమాల‌లో అఖండ 2, ఓజి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్ సైతం ఎగబడుతున్న పరిస్థితి. కారణం కోవిడ్ తర్వాత ఒక్క సినిమాకు కూడా సరైన బ్రేక్ ఈవెన్‌ కాకపోవడమే. స్టార్ హీరోల సినిమాలు సైతం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దక్కించుకున్న‌ పరిస్థితి. మహేష్ బాబు సర్కార్ వారి పాట, గుంటూరు కారం నుంచి.. చరణ్, తారక్‌ల ఆర్‌ఆర్ఆర్, అల్లు అర్జున్.. పుష్పా ఫ్రాంచైజ్‌, ప్రభాస్.. స‌లార్‌, క‌ల్కి లాంటి సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ టాక్ తోనూ కొన్ని చోట్ల బ్రేక్ సాధించలేకపోయాయి. అయితే.. సీనియర్ స్టార్ హీరోలు మాత్రం అంచనాలను మించి కలెక్షన్లు కొల్లగొట్ట‌డం విశేషం.

 

బాలయ్య నుంచి వ‌చ్చిన అఖండ 2, వీర సింహారెడ్డి, భగవంత్ కేస‌రితో పాటు.. వెంకటేష్ – సంక్రాంతికి వస్తున్నాం, చిరంజీవి – వాల్తేరు వీరయ్య సినిమాలు బ‌య్య‌ర్స్‌కు మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టాయి. లాభాలు అందించాయి. ఇక పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించి.. రిలీజ్ చేసినా.. బ్రేక్ ఈవెన్ అంచుల వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ – ఓజి, బాలకృష్ణ – ఆఖండ 2 సినిమాలకు.. ఆడియన్స్‌లో భారీ హైప్‌ నెలకొంది. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర భారీ డిమాండ్ మొదలైంది. అయితే.. ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ కానుండటం విశేషం.

 

దీనివల్ల.. సినిమాల ఓపెనింగ్స్‌కు భారీ దెబ్బ పడుతుందంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ.. ఓటీటీ డీల్స్ కారణంగా.. ఇది అనౌన్స్ చేసిన డేట్‌కి వచ్చే అవకాశాలు లేవంటూ తెలుస్తోంది. కారణం ఓటీటీ, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓజీ రైట్స్ ఇప్పటికే కొనుగోలు చేసింది. ఐదు వారాల గడువు మాత్రమే ఈ సినిమా రిలీజ్‌కు ఉంది. అక్టోబర్ చివరికి స్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ కుదిరింది. కానీ.. ఆఖండ 2ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. సెప్టెంబర్ 25న సినిమా ధియేటర్లలో రిలీజ్ అయితే.. అక్టోబర్ చివరికి ప్రైమ్ స్ట్రీమ్ చేసే అవకాశాలు లేవట‌. కారణం అక్టోబర్‌లో కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కానుంది. అలాగే మరికొన్ని సినిమాలు కూడా ఇప్పటికే స్లాట్స్ బుక్ చేసేసుకున్నాయి. దీంతో అఖండ 2 నవంబర్ వరకు స్లాట్ దొరకదు. నవంబర్ అన్ సీజన్ కనుక.. అఖండ 2 ఓటిటి రిలీజ్ మాత్రం డిసెంబర్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.