టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. త్వరలోనే ఆడియన్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పై సౌత్‌తో పాటు.. నార్త్ ఆడియన్స్‌లోను విపరీతమైన హైప్ నెలకొంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. బిజినెస్ కూడా భారీ లెవెల్‌లో జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా తెలుగు రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారని విషయం పై వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిపై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్లు షేర్ చేశాడు.
సీతారా ఎంటర్టైన్మెంటస్ బ్యానర్ పై వార్ 2 రిలీజ్ చూస్తూన్నాం. నాకు ఎంతో ఇష్టమైన తారక్ సినిమాతో మళ్ళీ మీ ముందుకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నటించిన రెండు సినిమాలు అరవింద సమేత వీర రాఘవ, దేవర మా బ్యానర్‌పై రిలీజై మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సమయం వచ్చింది. అభిమానులంతా సిద్ధమవ్వండి. వార్ 2లో మీరు ఇంతకుముందు చూడని సరికొత్త ఎన్టీఆర్ ను చూడబోతున్నారు. ఆగస్టు 14న సెలబ్రేషన్స్ చేసుకుందామంటూ ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకున్నాడు.
వార్ 2కు సంబంధించిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇక వార్ 2ను.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే భారీ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 స్క్రీన్‌లలో వార్ 2 రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యష్‌రాజ్ ఫిల్మ్‌స్.. స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న ఆరో సినిమా ఇది. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ముస్తాబ్ అవుతున్న ఈ సినిమాలో.. తారక్, హృతిక్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడే సీన్స్.. యాక్షన్ హంగామా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.