సీతారామం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్ ఠాగూర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో.. తెలుగులోను స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి బిజీబిజీగా గడుపుతుంది మృణాల్. ఇలాంటి క్రమంలో మృణాల్ ఠాగూర్ సీక్రెట్‌గా వివాహం చేస్తుందంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న ఓ పోస్ట్. ఫేస్ కనిపించకుండా తన కాళ్ళను మాత్రమే కనిపించేలా ఓ ఫోటో తీసి నెటింట షేర్ చేసుకుంది.
ఈ ఫోటోలో తన కాళ్లకు మెట్టెలు ఉండడంతో తెగ ట్రెండ్ చేస్తున్నారు. మృణాల్‌కి పెళ్లి కాలేదు కదా.. మెట్టెలు ఎక్కడ నుంచి వచ్చాయి అంటూ.. సీక్రెట్ గా ఆమె పెళ్లి చేసుకుందా అంటూ.. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు మేటర్ ఏంటంటే.. అందులో కాళ్లకు మెట్లతో షేర్ చేసిన ఆ పోస్ట్ మూవీ యూనిట్ పంచుకున్నారు. అయితే.. మృణాల్ తాజాగా.. మూవీ షూట్ లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే మృణాల్ ఠాగూర్ అభిమానులతో ఆమె అప్డేట్ పంచుకోవడం కోసం టీం ఈ పిక్ షేర్ చేసుకున్నారు.
ఇక ఈ షెడ్యూల్‌లో మృణాల్, అడవి శేష్‌తోపాటు.. ప్రధాన తారాగణం అంతా సందడి చేయనుంది. అంతేకాదు.. డెకాయిట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు టీం షేర్ చేసిన ఈ పోస్ట్ లో మృణాల్ ఫేస్ కనిపించడం లేదు. కానీ.. ఆమె కాళ్లకు మెట్టెలు కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కల్పించింది. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్.. అడవి శేషు భార్యగా కనిపిస్తుంది కావచ్చు.. అందుకే ఆమె కాళ్లకు మెట్లు ధరించి మెరిసిందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యార్లగడ్డ సుప్రియ ప్రొడ్యూసర్ గా వివరిస్తున్న ఈ సినిమాకు.. షానల్ డియో దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.