కింగ్‌డ‌మ్ ట్రైలర్ క్రేజీ రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని లైక్స్, వ్యూస్ వచ్చాయంటే..?

టాలీవుడ్ రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా కింగ్‌డ‌మ్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. గౌతం తిన్న‌నూరి డైరెక్షన్‌లో.. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ సినిమా.. ఈనెల 31న గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భాగ్యశ్రీ బోర్సే విల‌న్‌గా మెరవనున్న ఈ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే.. అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందింది. ఇక మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కనున్న క్ర‌మంలో సినిమాపై హైప్‌ పెంచేందుకు తాజాగా మేకర్స్‌ ట్రైలర్ను రిలీజ్ చేశారు.

KINGDOM - Official Trailer | Vijay Deverakonda | BhagyaShri Borse | Anirudh  | Gowtam Tinnanuri

ఇటీవల రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకోవడమే కాదు.. సినిమాపై ఆడియన్స్ లో అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే.. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఓ క్రేజి రికార్డ్‌ సొంతం చేసుకుందని.. మంచి వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతుందంటూ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. అంతేకాదు.. విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 6.10 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా.. 276.2 లైక్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఈ సినిమా ట్రైలర్‌కు రిలీజ్ అయిన 24 గంటల్లో.. అసలు ఊహించని రేంజ్‌లో లైక్, వ్యూస్ దక్కాయి అనడంలో సందేహం లేదు.

ఇక.. ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై అంచనాలు అంతకంత‌కు పెరుగుతున్నాయి. అంతేకాదు.. సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో జరిగినట్లు సమాచారం. కాగా.. గతంలో విజయ్ దేవరకొండ నుంచి తెర‌కెక్కిన లైగ‌ర్ సినిమా ట్రైలర్‌కు సైతం 24 గంటల్లో వ్యవధిలోనే అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ లైక్స్ దక్కాయి. అయితే ఆ సినిమాతో పోలిస్తే కింగ్‌డ‌మ్ ట్రైలర్ కు కాస్త తక్కువ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా.. వ్యూస్, లైక్స్ విషయంలో వెనుకబడి పోవడానికి కారణం విజయ్ దేవరకొండ గ‌త‌ సినిమాల రిజల్ట్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.