కింగ్‌డ‌మ్ సెన్సార్ కంప్లీట్.. రన్ టైం, బడ్జెట్ డీటెయిల్స్ ఇవే..!

టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్‌డ‌మ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా.. జులై 31న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ లాంఛనాల‌ను సైతం పూర్తి చేసుకున్నారు టీం. ఇక ఈ సినిమాలో 6 చిన్న చిన్న కట్స్‌ను సూచించిన సెన్సార్ సభ్యులు.. u/a సర్టిఫికెట్ జారిచేశారు.

ఇక 160 నిమిషాల ఫైనల్ రన్ టైంతో సినిమా థియేటర్‌ల‌లో సందడి చేయనుందట. ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ.. మూడు గంటల రన్ టైం తో తెర‌కెక్కుతున్న క్రమంలో.. కింగ్‌డ‌మ్ కేవలం 2 గంటల 40 నిమిషాల నడివితో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది సినిమాకు మెయిన్ అడ్వాంటేజ్. ఇక రూ.130 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమా.. రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఇక కింగ్‌డ‌మ్‌ కేవ‌లం ఓటీటీ ద్వారానే ఇప్పటికే రూ.50 కోట్లు రాబ‌ట్టింది.

శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్ ద్వారా మరో రూ.15 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ధియేట్రిక‌ల్‌ బిజినెస్ ద్వారా రూ.55 కోట్లు ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తుంది. దీని బ‌ట్టి మూవీ పై ఆడియ‌న్స్‌లో ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఈ సినిమా రిలీజై సక్సెస్ అందుకోవాలంటే విజయ్ దేవరకొండ రూ.56 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ టార్గెట్‌ రీచ్ కావాలి. అంటే.. కనీసం రూ.86 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇక.. ఈ సినిమాకు జులై 30 నుంచి ప్రీమియర్స్ పడనున్నాయని సమాచారం. మరి.. రౌడీ స్టార్ తన టార్గెట్ రీచ్ అవుతాడా.. లేదా.. సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.