ఆ మ్యాటర్లో కూలి కంటే ముందున్న వార్ 2.. ప్లాన్ అదిరిపోయిందిగా..!

కోలీవుడ్ థ‌లైవార్‌ రజనీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 సైతం రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియ‌న్‌ సినిమాల రిలీజ్ అంటే.. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ఎలా ఉంటుందో.. ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి హడావిడి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టీం ఏం చేస్తున్నారు.. మనం అంతకంటే ఆడియన్స్ లో హైపె పెంచేలా ఏం చేయాలని డిస్కషన్.. ఇరు పినీ వర్గాలలో జరుగుతూనే ఉంటాయి.

వాళ్ళ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు.. మనం రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండనుందో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇదే పోటీ ఇప్పుడు వార్ 2, కూలి సినిమాల విషయంలో నెలకొంది. వార్ 2లో హృతిక్, తారక్‌ లాంటి బడా స్టార్ హీరోస్ నటిస్తుండగా.. కూలి సినిమాలో రజనీతో.. నాగర్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ మెరవనున్నారు. ఈ క్రమంలోనే రెండు సినిమాల్లో కాస్టింగ్ విషయంలోనూ ఆడియన్స్ లో భారీ హైప్‌ నెలకొంది. మంచి అంచనాలు మొదలయ్యాయి. అయితే.. ప్రమోషన్స్ పరంగా మాత్రం వార్ 2 కంటే ఇప్ప‌టివ‌ర‌కు కూలి కాస్త ముందు ఉందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజై ఆక‌ట్టుకుంది. అలాగే ఎప్పటికప్పుడు ప్రమోషనల్ వీడియోస్ తో ఆడియన్స్ను మెప్పిస్తున్నారు కూలీ టీం. నిన్నకాక మొన్న వచ్చిన మౌనిక సాంగ్ ఏ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్‌ చేసిందో తెలిసిందే.

ఇక ఆగస్టు 2న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కానీ.. వార్ 2 సినిమాకు మాత్రం టీజర్ మినహా ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఇలాంటి క్రమంలో వార్ 2 ప్రమోషన్స్ లో మేకర్ జోరు పెంచనున్నారు. ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా సినిమాకు సంబంధించిన కంటెంట్ ఆడియన్స్ కు అందించాలని.. పోటీలో ముందుండాలని స్ట్రాంగ్ ప్లానింగ్ చేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ కట్ కూడా ఇప్పటికే పూర్తయిపోయిందని.. 2 నిమిషాల 30 సెకండ్లు న‌డివితో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక కూలి కంటే ముందే వార్ 2 ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. జూలై చివర్లోనే గ్రాండ్ లెవెల్లో వార్ 2 ట్రైలర్ లాంచ్ జరగనుందని.. అలాగే తారక్ హృతిక్‌.. ఇద్దరు సపరేట్‌గా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేయనున్నారని.. ప్రమోషన్ కోసం దాదాపు 20 రోజులపాటు సమయాన్ని వార్ 2 కోసమే ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు కేటాయించనున్నారని సమాచారం. కూలీ కంటే వార్ 2 ముందుండేలా టీం ప్లాన్ చేస్తున్నారట.