టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. పాన్ ఇండియా లెవెల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తను నటించిన ప్రతి సినిమాతోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్నాడు.
ఇక ప్రభాస్ గురించి తెలిసిన వారంతా.. ఆయన చాలా మితభాషి అని.. తను కంఫర్ట్ జోన్లో ఉంటాడని.. ఎవరితో అయినా అవసరానికి మించి మాట్లాడరని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ప్రభాస్ వ్యక్తిత్వం పరంగా కూడా ఎంతోమంది ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రభాస్ కు ఇష్టమైన విషయాలు తెలుసుకోవాలని ఆరాటం కచ్చితంగా అభిమానుల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫేవరెట్ సాంగ్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీలోదే నంటూ.. ఆ సాంగ్ ఇప్పటికే ప్రభాస్ ఎన్నో వేల సార్లు విన్నారంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక ప్రభాస్ కూడా పలు ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
ఇంతకీ ఆ సాంగ్ ఏదో కాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా మూవీలోని.. చలోరే చలోరే చల్ సాంగ్. ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టమని.. లిరిక్స్ అన్నా, మ్యూజిక్ అన్నా అందులో మీనింగ్ అన్న నాకు ఇష్టమని.. నేను ఎక్కువగా వినేది ఇదే సాంగ్.. ఇప్పటికీ ఆ పాటను వింటూనే ఉన్నా అంటూ ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.