చిరు కూతురు సుస్మిత హీరోయిన్గా నటించిన మూవీ ఏదో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన నటన, డ్యాన్స్ పెర్ఫార్మన్స్‌లతో అదరగొడుతున్న చిరంజీవి.. ఫిట్నెస్ తోను అందరికీ షాక్‌ను కలిగిస్తున్నాడు. ఇక చిరు నుంచి.. చరణ్, వైష్ణవి తేజ్ వరకు అరడజక పైగా మెగా హీరోలను సైతం తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా హీరోలుగా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. నిర్మాతలుగాను మెగా ఫ‌ఫ్యామిలీ నుంచి చాలామంది రాణిస్తున్నారు. కానీ.. హీరోయిన్లుగా మాత్రం మెగా కుటుంబం నుంచి నిహారిక ఒక్కరే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇలాంటి క్రమంలో.. తాజాగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. మెగా డాటర్ నిహారిక కంటే ముందే.. మెగా ఫ్యామిలీ నుంచి మరో బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించిందట. ఆమె మరెవరో కాదు.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ఎస్.. మీరు ఉన్నది కరెక్టే. ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుస్మిత.. చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. అయితే నిర్మాతగా కాకుండా.. సుస్మిత ఒకానొక టైంలో హీరోయిన్గా రాణించాలని ఆసక్తి చూపిందట. ఒక సినిమా కోసం నటనకు కూడా సిద్ధమైంది. ఆ మూవీని పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఉదయ్ కిరణ్ హీరోగా రూపొందించిగా.. ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ కూడా పూర్తైంద‌ట‌.

సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అనివార్య కారణాలతో సినిమా ఆగిపోయింది. దాంతో సుస్మిత హీరోయిన్గా మారాలి అన్న కల కూడా ఆగిపోయింది. అంతేకాదు.. మెగాస్టార్ కూడా తన కూతురు సుస్మితను హీరోయిన్గా చూడాలని ఎంతగానో ఆశ పడ్డారట. అలా ప్రయత్నాలు చేసినా ప్రతిసారి ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదురవడంతో ఆమె హీరోయిన్ కావాలన్నా కల‌ నెరవేరలేదు. ఇక మెగా హీరోయిన్గా మొదటి నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. పెళ్లి తర్వాత బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ విడాకుల తర్వాత ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం యాక్టింగ్ పక్కన పెట్టి నిర్మాతగా రాణిస్తుంది. కమిటీ కుర్రాళ్ళతో తాజాగా ప్రొడ్యూసర్గా మారి మంచి సక్సెస్ లో అందుకుంది నిహారిక.