ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలకృష్ణ ఓ మూవీలో నటించాడని తెలుసా.. కారణమేంటంటే..?

ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజై రిజల్ట్ వచ్చేవరకు సినిమా హిట్ అవుతుందో.. ఫ్లాప్ అవుతుందో.. ఎవరికి తెలియదు. అలాకాకుండా సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిస్తే.. ఎవ్వరూ చేయరు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లు తమ వద్దకు వచ్చిన కథలు ప్లాప్ అవుతుందని చిన్న సందేహం వచ్చిన రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక.. సగం షూట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. అలాంటిది బాలయ్య తన సినీ కెరీర్‌లో ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిన తప్పక నటించాల్సి వచ్చిందట.

Tiragabadda Telugubidda Telugu Full Movie || Balakrishna, Bhanu Priya

ఇంతకీ ఆ సినిమా ఏంటి.. బాలయ్య ఎందుకు నటించాడో ఒకసారి తెలుసుకుందాం. ఆ మూవీ మరేదో కాదు కోదండరామిరెడ్డి డైరెక్షన్లో రూపొందిన తిరగబడ్డ తెలుగు బిడ్డ. ఈ మూవీ అసలు థియేటర్ల‌లోకి ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండానే చాప చుట్టేసింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కాగా.. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే బాలయ్యకు తెలుసట. ఈ సినిమాలో నటించడం కూడా బాలయ్యకు అసలు ఇష్టం కూడా లేదట‌. అంతేకాదు.. డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా ఈ సినిమా ప్లాప్ అవుతుందని ముందే గ్రహించారు.

Balakrishna - Kodandarami Reddy: బాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డి  కాంబినేషన్‌లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయంటే..

కానీ.. ఎన్టీఆర్ కోసం తప్పక ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్న టైంలో అనసూయమ్మ గారి అల్లుడు సినిమాకు దర్శకత్వం వహించి.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన నాకు మరొక ఛాన్స్ ఇచ్చారు. అలా.. తిరగబడ్డ తెలుగు బిడ్డ కథ నేను ఆయనకు వినిపించా. కానీ.. తర్వాత నాకే స్టోరీ ఎందుకో నచ్చలేదు. అప్పుడే సినిమా ఆపేద్దాం అని చెప్పా. కానీ.. ఎన్టీఆర్ స్వయంగా మాట్లాడి ఈ సినిమా కచ్చితంగా చేయాల్సిందే అని చెప్పడంతో కాదనలేక ఇష్టం లేకపోయినా సినిమా తీశా. చివరకు అది అనుకున్నట్లే డిజాస్టర్ గా మారింది అంటూ వివరించాడు.