టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. అయితే ఈ రోల్ చేసేందుకు ఆయన అంత సులువుగా ఒప్పుకోలేదని.. డైరెక్టర్ లోకేష్ కనుకరాజ్ వెల్లడించాడు. కూలి సినిమాకు రజనీకాంత్ గారిని ఒప్పించడానికంటే ఎక్కువ టైం నాగార్జున సార్‌ను ఒప్పించడానికి పట్టిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొదట రజనీతో ఒక ఫాంటసీ ఫిలిం చేయాలని అనుకున్నా. అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర టైం పడుతుందని.. ఈ లోపు కూలి కథ రాశా అంటూ ఆయన వివరించాడు.
దానికి రజినీ వెంటనే ఒప్పుకున్నాడని.. ఆయనది లార్జర్ ధెన్ లైఫ్ ఇమేజ్ కనుక ఎలాంటి రోల్ రాసినా.. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇక కూలి కోసం నాగార్జునతో జరిగిన ఒక కాన్వర్జేషన్ వివరిస్తూ.. రజనీకాంత్ గారిని కూలీ సినిమా గురించి ఎలా ఒప్పించానని నాగార్జున నన్ను అడిగారని.. ఆయన కంటే మిమ్మల్ని ఒప్పించడానికి ఎక్కువ టైం పట్టిందని చెప్పా అంటూ వివరించాడు. తన 40 ఏళ్ల నట ప్రయాణంలో ఇలాంటి (బ్యాడ్ వర్డ్స్) డైలాగ్స్ ఎప్పుడు చెప్పలేదని నాగార్జున సార్ నాతో అన్నారు. సినిమా చూసిన తర్వాత మీ ఫ్యామిలీ ఏమంటారు అని అడిగా.. వాళ్ళ రియాక్షన్ కోసం నేను ఎదురు చూస్తున్న అంటూ నాగార్జున చెప్పారని వివరించాడు.
నాగార్జునని ఒప్పించడం కోసం ఎనిమిది సార్లు స్టోరీ నరేష్ చేశాడట లోకేష్. తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో మొదటిసారి విలన్ రోల్‌లో నటించడం అంటే.. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు కదా. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, మలయాళం సౌబిన్ షాహిర్, తమిళ యాక్టర్ సత్యరాజ్, కన్నడ స్టార్ ఉపేంద్ర వీళ్లంతా వెంటనే ఒప్పుకున్నారంటూ వివరించాడు. అమీర్ ఖాన్ స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్న ఆయన ఇంపాక్ట్ చాలా ఉంటుందని.. సైమన్ పాత్రలో నాగార్జున స్క్రీన్ టైం ఎక్కువే ఉందని. ఇంపాక్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందంటూ వివరించాడు లోకేష్ కలకరాజ్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.