భారీ గ్యాప్ తర్వాత.. పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమల్లు ఎట్టకేలకు సిద్ధమవుతుంది. భారీ నష్టాలు ఎదుర్కొన్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు పరిధిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 24న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ట్రైలర్ కట్ అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమా టైలర్ గురించి సెలబ్రిటీలు పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఇక తాజాగా.. ఈ సినిమా ట్రైలర్ గురించి పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవి సైతం రియాక్ట్ అయ్యారు.వాట్ ఆన్ ఎలక్ట్రిఫైంగి ట్రైలర్ అంటూ రాసుకొచ్చిన చిరు.. దాదాపు నాలుగు ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ సినిమా స్క్రీన్ పై రావడం పవన్ ఫైర్ చూపించడం చాలా సంతోషంగా అనిపించింది.. హరిహర వీరమల్లు టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్విట్ షేర్ చేస్తున్నాడు.
అంతేకాదు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ సినిమా ట్రైలర్ పై రియాక్ట్ అవుతూ ట్విట్ చేశాడు. వీరమల్లు ట్రైలర్ సినిమా గ్రాండ్ ఎలా ఉండబోతుందో.. చెప్పేస్తుందని పవన్ గారిని బిగ్ స్క్రీన్ పై చూద్దాం. మన అందరికీ మంచి ట్రీట్.. బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా క్రిష్ డైరెక్షన్లో మొదలై.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఏ.ఎం. రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.