బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ షురూ.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్క్రీన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చివరిగా నటించిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాటు.. ప్రస్తుతం బాలయ్య ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌లో నటిస్తున్న క్ర‌మంలో ఈ సినిమాపై కూడా నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో మెర‌వ‌నున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి క్రమంలోనే.. బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్.. అది నాయకుడు, పాండురంగడు, లెజెండ్ లాంటి సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్‌లో మెప్పించిన బాలయ్య.. మరోసారి తన డ్రీం ప్రాజెక్టులో ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అదే ఆదిత్య 999. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నున్నట్లు తెలుస్తుంది. గతంలో సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెర‌కెక్కిన ఆదిత్య 369 సీక్వెల్‌గా ఇది రూపొందనుంది.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాల‌ మధ్య ప్రయాణించిన సైంటిఫిక్ ఫ్రిక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు క్రిష్ మరింత వైవిద్యంగా విభిన్న టైమ్ జోన్‌ను జోడించి మరింత ఇంట్రెస్టింగ్గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మోక్ష‌జ్ఞ‌ గ్రాండ్ ఎంట్రీ కూడా ఉండనుందట. ఒకటి.. ప్రస్తుత కాలం, మరొకటి భవిష్యత్తు, ఇంకొకటి పురాతన కాలానికి చెందిన పాత్రలుగా తెలుస్తుంది. ఇక సస్పెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక.. మోక్షజ్ఞ సినిమాలో హీరోగా నటించుకున్న పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నాడని సమాచారం. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని.. గోపీచంద్ మ‌ల్లినేని డైరెక్షన్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాను బాలయ్య పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తే మరింత బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.