అఖండ 2 కోసం బాలయ్య బిగ్ రిస్క్.. అసలు వర్కౌట్ అయ్యేనా..!

టాలీవుడ్ నందమూరి నరసింహం బాలకృష్ణ ఇప్పటికే నాలుగు వరస హిట్లతో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా అఖండకు సీక్వెల్ గా ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్టర్గా రూపొందుతున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ టీజర్ సైతం తాజాగా రిలీజై ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ ఏడది దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం సర్వే గంగా జరుగుతుంది.

Akhanda 2 (2025) - Movie | Reviews, Cast & Release Date in akhanda-2- BookMyShow

కాగా.. అఖండ 2 బడ్జెట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు ఏకంగా రూ.160 కోట్ల ఖర్చు చేస్తునట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. ప్రస్తుతం బాల‌య్య‌కు ఉన్న మార్కెట్ రిత్య ఇది నిజంగా పెద్ద సాహసమే అనడంలో అతిశ‌యోక్తి లేదు. అఖండ సినిమాను రూ.50 నుంచి రూ.60 కోట్లతో తెర‌కెక్కించ‌గా.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. తర్వాత.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌లు బ్రేక్ ఈవెన్ దాటి క్లీన్ హిట్ గా నిలిచాయి.

Akhanda 2: Balayya's unseen look to leave fans stunned

ఇలాంటి క్రమంలో అఖండ 2కి ఈ రేంజ్‌ బడ్జెట్ ఖర్చు చేయడం అంటే.. రూ.200 కోట్లమేర బిజినెస్ తప్పక చేయాల్సి ఉంటుంది. అంతటి ఫ్యాన్సీ ధరకు అఖండ 2 తీసుకునేందుకు బయర్లు సిద్ధమవుతారా అనేది ఇప్పుడు అందరిలోనూ సందేహంగా మారింది. ఎంత హిట్ కాంబినేషన్ అయినా.. బాలయ్య మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక.. ఇప్పటివరకు కనీసం రూ.200 కోట్ల గ్రాస్ రికార్డ్ కూడా లేని బాలయ్యకు.. అఖండ 2 రూ.200 కోట్ల బిజినెస్ జరగడం అంటే సాదాసీదా విషయం కాదు. అఖండ 2 బడ్జెట్ విషయంలో.. బాలకృష్ణ బిగ్ రిస్క్‌ చేస్తున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు.. మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా.. 14 రిలీస్ నిర్మాణ భాగస్వామ్యంతో బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మించింది.