” ఏమాయ చేసావే ” రీ రిలీజ్ చైతుతో కలిసి ప్రమోషన్స్.. సమంత క్లారిటీ..!

టాలీవుడ్ స్టార్ బ్యూటి సమంత, అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఏ మాయ చేసావే. సుమారు 15 ఏళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా జులై 18, 2025న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్చేయ‌నున్నారు టీం. ఈ క్రమంలోనే అభిమానులంతా సినిమా విషయంలో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో.. ఆడియన్స్‌ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత మొట్టమొదటి టాలీవుడ్ సినిమా అయినా.. ఈ సినిమాతో అమ్మడు తిరుగులేని పాపులారిటీ ద‌క్కించుకుంది.

Prime Video: Ye Maya Chesave

ఈ క్రమంలోనే ఏమాయ చేసావే రిలీజ్ ప్రమోషన్స్‌లో నాగచైతన్యతో కలిసి సమంత పాల్గొంటుందంటూ ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా.. దీనిపై సమంత రియాక్ట్ అయింది. నేను ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలన్నీ నిరాధారమైనవని.. తాను ఓ ప్రముఖ వెబ్సైట్‌కు వెల్లడించింది. మూవీ యూనిట్ తరఫున ప్రమోషన్స్‌లో నేను పాల్గొనే అవకాశం లేదని.. నిజానికి ప్రస్తుతం ప్రమోషనల్ ఈవెంట్లకు నేను దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి కూడా నాకు అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేసింది.

Prime Video: Ye Maya Chesave

బహుశా.. ప్రేక్షకులు మనసులో ఉన్న ఊహలే పుకార్లుగా బయటకు వస్తున్నాయేమో.. ఎవరి లైఫ్ కూడా ప్రజల దృష్టి కోణంపై ఆధారపడి ముందుకు సాగదు అంటూ సమంత క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమె తన కెరీర్ ప్రారంభంలో తనకు అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్ గురించి మాట్లాడుతూ.. తాను నటించిన‌ మొదటి మూవీ మస్కోవిన్ కావేరి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంది. అంతేకాదు.. ఏమాయ చేసావే సినిమా టైంలో తనకు ఎన్నో స్పష్టమైన గుర్తులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. జెస్సి, కార్తీక్ పై ఫస్ట్ షాటే ఇంటిమేట్ సీన్ అని వివ‌రించిన సామ్‌.. కెరీర్ ఆరంభంలోనే డైరెక్టర్ గౌతమ వాసుదేవ్ మీనన్‌తో పనిచేయడం.. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.