ఓ హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరోలు చేయడం.. ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టడం.. కొత్తేమి కాదు. అది టాలీవుడ్ ఇండస్ట్రీలను సర్వసాధారణం. అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన పుష్పను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి ఏ రేంజ్లో సంచలనలు సృష్టించాడో తెలిసిందే. ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్లో ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. అప్పట్లో మహేష్, సుకుమార్ కాంబోలో సినిమా ప్రకటించిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల.. సినిమా రద్దు అయిపోయిన సంగతి తెలిసిందే. స్వయంగా ట్విట్టర్ వేదికగా మహేష్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే సినిమా బన్నీ చేతిలోకి వెళ్లి.. పుష్పగా తెరకెక్కి రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే.. ఇదే సినిమాలో మహేష్ చేయకుండా రిజెక్ట్ చేసి మంచి పని చేసాడని.. ఇలాంటి రోల్ మహేష్ అసలు సెట్ కాదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని ఉపయోగించి.. మహేష్‌ను పుష్ప క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో డిజైన్ చేసి.. ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకి ప్రస్తుతం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా మహేష్ కి సూట్ అవ్వదని అన్నవాళకు ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తూ.. ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో చూడండి.
మహేష్ ఈ క్యారెక్టర్ లో దుమ్ము రేపే వాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ ప్రాజెక్టుస్ SSMB 29లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక సర్వే గంగా షూట్ పూర్తి చేస్తున్న టీం.. 2027 నాటికి ఈ మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో మెరమన్నారు. కాగా.. ఇలాంటి క్రమంలో మహేష్ యాజ్ పుష్ప.. వీడియో వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మీరు ఆ వీడియోను ఓ లుక్ వేసేయండి.
‘పుష్ప’లో మహేశ్‌బాబు నటించి ఉంటే ఇలా ఉండేదా.. వీడియో వైరల్..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తున్నారు. వివిధ వీడియోలు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. pic.twitter.com/DpENDXwiQi
— ChotaNews App (@ChotaNewsApp) June 17, 2025