టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామ హరిహర వీరమల్లు. మొదట జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. తాజాగా.. అందుతున్న సమాచారం ప్రకారం.. గత రెండు రోజులుగా అమెజాన్ ప్రేమతో మూవీ టీం రిలీజ్ డేట్‌పై చర్చలు జరుపుతున్నారని.. టీం జులై 18న సినిమా రిలీజ్ చేద్దామని చెప్తుంటే.. అమెజాన్ ప్రైమ్ ససెమేరా ఒప్పుకోవడం లేదట. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను జూలై 25న రిలీజ్ చేయాలని అమెజాన్ తెల్చేసింది.
లేదంటే.. రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు బిజినెస్ డీల్ నుంచి కట్ చేస్తామని.. ప్రొడ్యూసర్ ఏ.ఏం.రత్నంను బెదిరిస్తున్నారట. మరోపక్క.. అదే రోజున విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా కూడా జూలై 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్ చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా కింగ్‌డమ్ టీంకు షాక్ ఇచ్చిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో అవకాశం ఇవ్వడం కుదరదు.. జులై 25న సినిమాను రిలీజ్ చేయాల్సిందే అని పట్టు పట్టిందట. దీంతో.. ఈ రెండు సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే పవన్ వర్సెస్ రౌడీ స్టార్ క్లాష్ తప్పదంటూ సినీ వర్గాల సమాచారం.
పెట్టిన ఖర్చులు, జరిగిన బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం రెండు వారాల ఫ్రీ సమయమైనా దొరకాలి. కానీ.. ఇక్కడ ఫుల్ టైట్‌గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి నిర్మాత రత్నం ఎలాంటి ప్లాన్ వేస్తాడు.. ఏం చేయబోతున్నాడు వేచి చూడాలి. ప్రస్తుతం పవన్ అభిమానులతో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా రిలీజ్ డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే సినిమా తేదీని ప్రకటిస్తే.. మిగిలాగా సినిమాలకు రిలీజ్ డేట్ లో అనౌన్స్ చేసుకునే లీనస్ ఉంటుంది. లేదంటే అన్ని సినిమాలు రిస్క్ లో పడతాయి. ఈ క్రమంలోనే ఈ వారంలో వీలైనంతవరకు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తారని తెలుస్తుంది.