ఎన్టీఆర్ వార్ 2 కోసం రంగంలోకి టాప్ ప్రొడ్యూసర్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ మూవీ అయినా.. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నటిస్తూండడంతో టాలీవుడ్ ఆడియన్స్ లో సైతం సినిమాపై మంచి బ‌జ్ నెలకొంది. కేవలం టాలీవుడ్, బాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అంతేకాదు.. తాజాగా సినిమా నుంచి ఒక క్రేజీ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకరస్‌. ఈ పోస్్ట‌ర్ సైతం తెగ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా బిజినెస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే వార్ 2 తెలుగు రైట్స్ కోసం.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు రంగంలోకి దిగార‌ట‌.

వాళ్ళ మధ్యన గట్టి పోటీ నెలకొంది అంటూ టాక్ నడుస్తుంది. అయితే.. మరోపక్క ఈ సినిమా రైట్స్ మేకర్స్ ఎవరికీ అమ్మడం లేదని.. నిర్మాణ సంస్థ య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ వాళ్లే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుతానికి వార్ 2 హక్కుల కోసం తెలుగు టాప్ ప్రొడ్యూసర్ నాగ‌ వంశీ ఆసక్తి చూపుతున్నాడని.. అయితే మేక‌ర్స్‌ మాత్రం.. నాగ‌ వంశీ కోడ్ చేస్తున్నా దానికంటే ఎక్కువగా ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో వార్ 2 బిజినెస్ ఇంకా ఆన్ లోనే ఉంద‌ట‌. ఇక చివరకు వార్డు తెలుగు రైట్స్ ఎవరికి సొంతమవుతాయో.. లేదంటే య‌స్ రాజ్ ఫిలిమ్స్ ఓన్‌గా రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.