లోకనాయకుడు కమల్ హాసన్ తాజా మూవీ థగ్ లైఫ్. ఆయన కెరీర్లో 234వ ప్రాజెక్టుగా వచ్చిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. దాదాపు 38 ఏళ్ల గ్యాప్ తర్వాత వీళ్ళ కాండోలో రూపొందిన సినిమా కావడం.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్‌ను మెప్పించడంతో రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ శింబు, త్రిష కీలకపాత్రలో మెరిశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం రిలీజై ఫస్ట్ షో పూర్తి చేసుకుంది. ఇంతకీ థగ్ లైఫ్ ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా.. కమల్ హాసన్ ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడు ఒకసారి చూద్దాం.
స్టోరీ
రంగరాయ శక్తి వేల్ (కమలహాసన్) గ్యాంగ్‌స్టర్.. అమరాన్ (శింబు) అనాధను.. శక్తివేల్ చిన్నప్పటి నుంచి చేరదీసి పెంచుతూ ఉంటాడు. సదానంద్ (మహేష్ మంజ్రేకర్) రత్నవేల్ ప్రత్యర్ధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో అమరాన్.. శక్తివల్ పై పగ తీర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అతని దెబ్బ కొట్టాలని సరైన టైమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శక్తివేల్ కొన్ని కారణాలతో కుటుంబానికి దూరమై.. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ అసలు శక్తివేల్ జైలుకు ఎందుకు వెళ్ళాడు.. చేరదీసి పెంచిన కొడుకు అమరాన్, శక్తివెల్ పై ఎందుకు పగ తీర్చుకోవాలి అనుకుంటాడు.. అసలు వాళ్ళిద్దరు మధ్య వార్ ఎక్కడ మొదలైంది.. అని సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ
మణిరత్నం సినిమాకు ఎగ్జిట్ అయ్యే ఆడియోస్ ఎంతమందైతే ఉంటారో.. బోరింగ్‌గా ఫీల్ అయ్యే జనాలు కూడా అదే రేంజ్లో ఉంటారు. ఆయన ప్రతి చిన్న సన్నివేశాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసే క్రమంలో.. లాగ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రామా ఎక్కువనే ఫీల్ కలుగుతుంది. ఎమోషన్స్ కూడా అధికంగా ఉంటాయి. అలాంటి క్రమంలో ఎంటర్టైన్మెంట్ కాస్త మిస్ అవుతుంది. ఈ సినిమా విషయంలోను అదే జరిగింది.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, బ్యాక్‌గ్రౌండ్ సెటప్ లాంటివి పరవాలేదు అనిపించినా.. ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు కథపై అసలు క్లారిటీ ఇవ్వకపోవడం కాస్త నిరాశగా అనిపించింది. అలా.. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా అనిపించినా.. సెకండ్ హాఫ్‌లో అద్భుతాలు జరిగే ఎలిమెంట్స్ ఉంటే.. సినిమా గట్టెక్కిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ.. ఈ సినిమాలో అది కూడా లేదు. ప్రేక్షకులు సహనాన్ని పరీక్షించేందుకే మణిరత్నం ఈ సినిమాలో సీన్స్ తెరకెక్కించిన ఫీల్ కలుగుతుంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదే సరి కదా.. కొన్ని సందర్భాల్లో చిరాకు వస్తుంది. ఇక సినిమాకు నిర్మాణ విలువలే ఆయూపట్టుగా నిలిచాయి. రవికే చంద్ర సినిమాటోగ్రఫీ ఓకే.
నటీనటుల పర్ఫామెన్స్:
కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోను తన నట విశ్వరూపాని చూపించాడు. ఒక మాటలో చెప్పాలంటే వన్ మాన్ షో అన్న ఫీల్ కలుగుతుంది. ఎప్పటిలానే ఆయన రేంజ్ కు తగ్గ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. వయసు మీద పడుతున్న యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపాడు. అభిరమి న్యాచురల్ నటనతో మెప్పించింది. త్రిష రోల్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఈ క్రమంలోనే పాత్ర పరిధిలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సింబు నటన అద్భుతం.. అతని స్క్రీన్ ప్రజెంట్ తక్కువగా ఉన్న ఫిల్ కలుగుతుంది. అయినా పాత్ర పరిధిలో ఆకట్టుకున్నాడు. నాజర్ పాత్రలో కొత్తదనం కనిపించలేదు. మిగతా నటినటులు ఎవరి పాత్రలో వాళ్లు మెప్పించే ప్రయత్నం చేశారు.
ప్లస్ లు, మైనస్ లు:
సినిమాకు ప్లస్ పాయింట్ ఎదైన ఉందంటే అది కచ్చితంగా కమలహాసన్ నటన అని చెప్పాలి. మూవీ నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫి మెప్పించాయి. సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ స్లో నరేషన్. కథ సాగదితా అనిపిస్తుంది. ప్రెడిక్టబుల్ సీన్స్.. బోర్ ఫీల్ కలిగిస్తాయి. త్రిష పాత్రకు సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం మరింత మైనస్.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అసలు ఆకట్టుకోలేదు.
ఫైనల్ గా:
గ్రాండ్ సెటప్‌తో కథ, కథన్ లేకుండా.. క్రేజీ బాక్స్ ఆఫీస్ కాంబో సెట్ చేసుకుని క్యాష్ చేసుకోవాలని సినిమా తీసినట్లు అనిపించింది.
రేటింగ్: 2.2/5