టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి.. అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలు ఎనలేనివి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ను ఇప్పటికీ టాలీవుడ్ దిగ్గజనటులుగా.. రెండు పిల్లర్లుగా భావిస్తూ ఉంటారు. అలాంటి నాగేశ్వరరావు తన సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. చివరి క్షణం వరకు కళామతల్లికి తన జీవితాన్ని అంకితం చేశారు. కాగా.. ఏఎన్ఆర్ చివరిగా తన కుటుంబ సభ్యులతో మనం సినిమా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయన ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఇక ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా.. తన సినీ కెరీర్‌లో ఎన్నో సార్లు క్యాన్సర్ ఉన్న పాత్రలో నటించిన.. ఆయన నిజజీవితంలోనూ అదే క్యాన్సర్ బారినపడి బాధపడుతూ మరణించారు.
ఈ క్రమంలోనే తాజాగా నాగేశ్వరరావు కుమార్తె నాగ సుశీల ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి చివరి క్షణాలు గురించి గుర్తుచేసుకున్నారు. నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అనే విషయం తెలియడంతో ఆయన చేసిన కొన్ని పనులను ఆమె వివరించారు. నాన్నగారికి ఆరోగ్యం బాగోవడం లేదని తనను కేర్ హాస్పిటల్కు తీసుకు వెళ్ళాం. వాళ్ళు సిటీ స్కాన్ చేసి అంబులెన్స్ లో వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళమన్నారు.. అప్పుడు కూడా నాన్న జోకులు వేస్తూ నాకు క్యాన్సర్ ఉందని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. అక్కడకు అందుకే తీసుకెళ్లమంటున్నారు అంటూ మాట్లాడాడు. మాకైతే ఫుల్ భయంగా ఉంది. నాన్న మాత్రం ఇలా సరదాగా మాట్లాడేస్తున్నారు.
బసవతారకం హాస్పిటల్‌కి వెళ్ళాం అక్కడ టెస్టులు చేసి క్యాన్సర్ ఉందని తెలిపారు. నాన్నగారికి వెంటనే కిమ్స్‌లో సర్జరీ చేయించాం. అయితే.. ఆయనకు క్యాన్సర్ ఉందని తెలియగానే తాను మా అందరికీ లైఫ్ లో ఉపయోగపడే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఎప్పుడు మొదటి స్థానంలో లేరని ఎవరు బాధపడకండి.. మొదటి స్థానంలో లేరంటే లైఫ్ లో ఇంకో మెట్టుకు ఎదిగే అవకాశం ఉందని అర్థం అని.. ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటారు అంటూ వివరించారు. నాన్న ఎప్పుడు ఎవరి రుణము ఉంచుకోలేదని.. అందుకే తనను హాస్పిటల్లో దగ్గరుండి కేర్ చేసిన డాక్టర్లు టీమ్ అందరికీ పిలిచి మరి బహుమతులు ఇచ్చారని చెప్పుకొచ్చింది. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఎక్కువ కాలం ఆయన బతకలేదని.. అక్టోబర్లో తెలుసుకున్నారు.. నవంబర్లో ప్రెస్ మీట్ పెట్టి అందరికీ విషయాన్ని చెప్పారు. ఆయన జనవరీలో చనిపోయారంటూ నాగ సుశీల చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.