ఆ హీరో కోసం శ్రీకాంత్ ను తొక్కేయాలని ప్లాన్.. డైరెక్టర్ కు రెండు కోట్లు ఛాన్స్ ఇచ్చిన పెద్ద మనిషి ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టేటస్ నిలబెట్టుకోవడం అంటే అంత సాధారణ విషయం కాదు. అక్కడ జరిగే రాజకీయాలను, కుట్రలను దాటుకొని నీళ్లదొక్కుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు వెళ్లకుండా తమ సత్తా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అడుగడుగున వెనక్కి లాగే వాళ్ళు.. తొక్కేయాలని చూసే వాళ్ళు కూడా ఉండనే ఉంటారు. మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాటికి తగ్గట్లు అవమానాలు, ట్రోల్స్ కూడా అధిగమించాల్సి ఉంటుంది.

Khadgam movie Re Release Date

వాటిని కూడా తట్టుకొని లక్ష్యాన్ని చేదించగలగాలి.. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లంతా కూడా ఈ చెడును కూడా తట్టుకునే నిలబడిన వాళ్లే. ఈ క్ర‌మంలోనే తాజాగా తన లైఫ్ లో జరిగిన ఓ విష‌యాని సీనియర్ హీరో శ్రీకాంత్ ఆడియ‌న్స్‌తో పంచుకున్నాడు. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో శ్రీకాంత్ కూడా ఒకడు. కాగా శ్రీకాంత్ కెరియర్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసిన మూవీలో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెర‌కెక్కిన‌ ఖడ్గం మూవీ కూడా ఒకటిన‌ ఈ సినిమాల్లో శ్రీకాంత్ ఏసీబీ రాధాకృష్ణ రోల్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. కార్తికేయ మూవీస్ పై సుంకర మధుమురళి నిర్మించిన ఈ సినిమాలో.. రవితేజ, ప్రకాష్, సోనాలి బింద్రే, సంగీత కీలకపాత్రలో మెరిశారు. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమా.. 2002 నవంబర్ 29న రిలీజై సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది.

ఇక ఏసీబీ రాధాకృష్ణ పాత్రను శ్రీకాంత్ నటించడానికి నిర్మాత మధు ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేశాడట. శ్రీకాంత్ ఫ్యామిలీ స్టార్ అని.. ఆయనకు అసలు ఈరోల్ సెట్ కాదని కృష్ణవంశీని కన్విన్స్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించాడట. అంతేకాదు.. జగపతిబాబు లేదా మరో పెద్ద హీరోని తీసుకుందాం.. ఇంకో రెండు కోట్లు ఎక్కువగా ఇస్తానని ఆఫర్ కూడా చేశాడట. కానీ.. కృష్ణవంశీ మాత్రం అస్సలు తగ్గకుండా శ్రీకాంత్ కి అండగా నిలిచి నిర్మాతలతో పోట్లాడి మరి ఆ రోల్‌ తనకు ఇప్పించాడట. ఆ సంఘటనను అవమానంగా ఫీలైన శ్రీకాంత్.. రాధాకృష్ణ రోల్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని పవర్ఫుల్ పోలీస్‌గా.. చనిపోయిన లవర్ కోసం బాధపడే వ్యక్తిగా.. 2 వేరియేషన్స్లో సరి సమానంగా పండించి విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక తర్వాత ఈ సినిమా శ్రీకాంత్ రోల్కు ప్రజల్లో వచ్చిన రెస్పాన్స్ చూసి.. నిర్మాత మధు కూడా శ్రీకాంత్‌ను ఏప్రిషియేట్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ ఇంటర్వ్యూలో రివిల్ చేశాడు.