టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షోకు ధియేటర్ల దగ్గర ఉండే సందడి వేరే లెవెల్లో ఉంటుంది. కాగా.. పవన్ సినిమాలతో పాటు.. రాజకీయాల్లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ఆయన.. చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అది కూడా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు మొదలయ్యాయి.
దీంతో.. సినిమా బిజినెస్ కూడా రికార్డ్ లెవెల్లో జరిగినట్లు సమాచారం. ఇక జూన్ 12న ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్ లెక్కలు.. ప్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. మొదట్లో రూ.100 నుంచి 150 కోట్లు బడ్జెట్ ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే.. సినిమాలు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ అయింది. దీంతో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి సందర్భంలో.. సినిమాపై ఇప్పుడిప్పుడే ఆడియన్స్‌లో హైప్ నెలకొంటుంది. పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ చివరిగా నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్లో సక్సెస్ అందుకోకపోవడంతో.. వీరమల్లుతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని.. సంచలనాలు క్రియేట్ చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు. పవన్‌కు అత్తారింటికి దారేది సినిమా తర్వాత వచ్చిన ఏ సినిమా ఊహించిన రేంజ్ లో బ్లాక్ బస్టర్‌గా నిలవలేదు. మరి.. ఈ సినిమాతో అయినా పవన్ సక్సెస్ అందుకని సినిమాల పరంగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడో.. లేదో.. వేచి చూడాలి.