శేఖర్ కమల డైరెక్షన్ లో పవన్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఎలాంటి క్రెజ్‌, పాపులార్టీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాజికల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. తను తెర‌కెక్కించే ప్రతి జానర్‌ను కల్ట్‌ క్లాసికల్‌గా తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ వచ్చాడు. అలా.. ఇప్పటివరకు గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ ఇలా ప్రతి కథతోను మంచి సక్సెస్ అందుకున్న ఆయన.. రీసెంట్గా రిలీజ్ అయిన కుబేరతో మరోసారి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ పరంగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో రూ. 200 కోట్లు కొల్ల‌గొట్ట‌నుంద‌ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి క్రమంలో శేఖర్ కమ్ములకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త‌ వైరల్ గా మారుతుంది. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల తన సినీ కెరీర్‌లో కేవలం మీడియం హీరోలతో లేదా కొత్త హీరోలతో మాత్రమే సినిమాలను రూపొందించి హిట్ కొట్టాడన్న సంగతి తెలిసిందే.

Sekhar Kammula Breaks Silence on Leader 2: "The Story Must Match Today's  India" - The Capital

అయితే.. ఆయన కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేసేవాడట. ఇక.. మొదటి నుంచి శేఖర్ కమ్ముల మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లకు పెద్ద అభిమాని అని.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. తన ప్రతి సినిమాకు పవన్‌ను హీరోగా ఊహించుకునే వాడట శేఖర్ క‌మ్ములా. గోదావరి సినిమాను మొదట పవన్‌తో తీయాలనుకున్నా అది వర్కౌట్ కాలేదంటూ చెప్పుకొచ్చాడు. అలాగే.. సూపర్ స్టార్ మహేష్ తో ఫిదా సినిమా చేయాలని భావించాడు. కానీ.. అది కూడా సక్సెస్ కాలేదు. కారణం స్టార్ హీరోలకు శేఖర్ కమ్ముల సబ్జెక్ట్ వర్క్ అవుట్ అవ్వదనే వాదన గట్టిగా వినిపించడమే. అయితే.. శేఖర్ కమ్ముల తాజాగా తెర‌కెక్కించిన కుబేరను ఆయన కంఫర్ట్ జోన్‌కి తగ్గ మూవీ కాదు. అయినా సరే.. ఈ జానెర్‌ను ఎంచుకొని ఆడియన్స్ కు గ్రేట్ ట్రీట్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. ఇలాంటి జోన‌ర్‌ను కూడా తీసి సక్సెస్ అందుకోగలడని మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఇలాంటి జాన‌ర్‌లో స్టార్ హీరోలతో సినిమాలు తీయడం పెద్ద కష్టం కాదంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు ఇష్టపడుతున్నారట.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్.. శేఖర్ కమ్ములతో.. పవన్ సినిమా తీయించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కుబేర కు ముందే ఈ టాపిక్ పై వీళ్ళ మధ్య చర్చ జరిగిందట. శేఖర్ క‌మ్ముల గతంలో పొలిటికల్ సిస్టంపై రానా దగ్గుబాటి హీరోగా లీడర్ సినిమాను రూపొందించి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాడు. ఆయన కెరియర్ లో ఈ సినిమా ఎవర్ గ్రీన్ కల్ట్‌ క్లాసికల్ అనడంలో సందేహం లేదు. పవన్ ప్రస్తుతం పాలిటికల్ లీడర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లీడర్ తరహాలో పవర్ఫుల్ పొలిటికల్ సబ్జెక్టును తీసుకొని పవన్‌తో సినిమా చేస్తే బాగుంటుందని శేఖర్ కమ్ముల ఎప్పటినుంచో ఆలోచన చేస్తున్నాడట. ఈ ఆలోచనతోనే అద్భుతమైన కథను రాసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే.. వీళ్ళిద్దరి కాంబోలో పవర్ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ సెట్స్‌ పైకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ.. నిజంగానే వీళ్ళిద్దరి కాంబోలో పొలిటికల్ స్టోరీ వస్తే మాత్రం కచ్చితంగా ఆడియన్స్‌లో హైప్ పీక్స్ లెవెల్‌లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.