మెగాస్టార్ చిరు బర్తడే ట్రీట్ విశ్వంబరా కాదు .. ఫాన్స్ కు భారీ షాక్..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22 ను అభిమానులు ఎంతో ఘనంగా పండగల జరుపుకుంటారు .. దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. అలాగే ఆ రోజు మెగాస్టార్ తన కొత్త సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు . అయితే చిరు నుంచి ఈసారి బర్త్డే కానుకగా విశ్వంభర వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ..కానీ ఈ పుట్టినరోజు కి మెగా ట్రీట్ విశ్వంభర నుంచి ఉండటం లేదని సిని వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ..

Vishwambhara Team Planning to Release after getting Output only - NTV Teluguవిశ్వంభర వర్క్ ఇంకా పెండింగ్లో ఉండడంతో ఈ మూవీ రిలీజ్ అప్పటికి సాధ్యం అవ్వదని .. మెగా ఫ్యాన్స్ కోసం చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా ని మరోసారి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట .. ఇలా మెగాస్టార్ బర్త్డే రోజున చిరంజీవి నటించిన కొత్త సినిమా వస్తుందేమో అని ఎంతగానో భావించిన అభిమానులకు .. ఇప్పుడు స్టాలిన్ సినిమా తో వారి ఆశలపై నీళ్లు చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు సోషల్ మీడియా లో కామెంట్లు కూడా చేస్తున్నారు ..Stalin Movie Re Release Date Confirmedకానీ విశ్వంభర కు మోక్షం ఎప్పుడనేది అంతు చిక్కడం లేదు. గత నెల జగదేకవీరుడు అతిలోకసుందరి సక్సెస్ అయిన క్ర‌మం లో స్టాలిన్ కి అంతకు మించి స్పందన వస్తుందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు . నాగబాబు నిర్మాత గా ఆరెంజ్, గుడుంబా శంకర్ రీ రిలీజుల్లోనే ఎక్కువ పే చేశాయి. మరి స్టాలిన్ ఏం చేస్తాడో.ఇక మరి ఈ విషయం పై ఏదైనా అఫీషియల్ ప్రకటన వస్తుందేమో చూడాలి ..