” కుబేర ” యుఎస్ఏ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. ?

కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కుబేర. కింగ్‌ నేను నాగార్జున కీలకపాత్రలో, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన అంచ‌నాలు నెలకొన్నాయి. క్లాసికల్ సినిమాలను రూపొందిస్తూ.. ప్రేక్షకులను తన‌వైపు తిప్పుకుంటున్న‌ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఫ్యామిలీ ఆడియోస్ ను తన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ రాణిస్తున్నాడు. తన సినిమా స్టైల్ మార్చుకుని.. మొదటిసారి ధనుష్, నాగార్జునతో కలిపి కుబేర సినిమా రూపొందించాడు.

ఈ సినిమా ఈనెల 20న (రేపు) గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా యూఎస్ లో సినిమా ప్రీమియర్ షోలు ముగిసాయి. మరి ఆ షో ఆల్రెడీ వీక్షించిన ఆడియన్స్ రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పలువురు.. ఊహించిన రేంజ్‌లో సినిమా అయితే లేదని.. రెగ్యులర్ సినిమాల లాగానే అనిపిస్తుంది అంటూ.. నాగార్జున రోల్ గతంలో చూసిన పలు సినిమాల బిజినెస్ మ్యాన్ పాత్ర‌లానే రొటీన్ అనిపించిందని.. స్కాం మేటర్ లోను గ‌త‌ సినిమాల్లో ఉండే రెగ్యులర్ స్టోరీ నడిచిందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ధనుష్ క్యారెక్టర్ కాస్త వేరియేషన్స్ ఉన్నప్పటికీ.. అక్కడక్కడ బిచ్చగాడు సినిమా పోలికలు కనిపించాయని చెబుతున్నారు. నటన మెప్పించిన డైరెక్టర్స్ స్లో నరేషన్ ఆడియన్స్ మెప్పించ లేకపోయిందని.. కొన్నిసార్లు ల్యాగ్ అన్న ఫీల్ కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సినిమాలో ప్రతి ఒక్క పాత్రను జస్టిఫికేషన్ చేసే విధంగా శేఖర్ క‌మ్ముల డిజైన్ చేసే ప్రయత్నం చేసిన అది ఆడియన్స్‌కు పూర్తిస్థాయిలో కనెక్ట్ అవ్వడం లేదంటూ ప్రేక్షకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సినిమా అసలు రిజల్ట్ తెలియాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే.