మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌లో పలకరించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై విష్ణు ఆశలన్ని పెట్టుకున్నడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవడం ఖాయమని.. తన ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కట్స్, ఐటం సా్గ్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన ఈ సినిమాలో కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే.
అంతే కాదు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్టింగ్ అంతా.. ఈ సినిమాలో కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. తాజాగా.. కన్నప్ప సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే.. సినిమా రన్ టైం మొత్తం 182 నిమిషాలు అని.. అంటే 3 గంటల 2 నిమిషాలట. మైథాలాజికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో.. రన్ టైం కాస్త ఎక్కువగానే ఉందట. అయితే.. మొదట 195 నిమిషాలు రన్ టైంతో సినిమా రూపొందగా.. సెన్సార్ మొత్తం 12 కట్స్ చెప్పిందట.
సిబిఎఫ్‌సి నిబంధనల ప్రకారం సినిమాల్లో మార్పులను అంగీకరించిన టీం.. రాబందు చిన్నారిని పైనుంచి పడేయడం, తిన్నాడు కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్, అలాగే.. మూడు పాటల్లోని విజువల్స్‌ను తొలగించారట. మొత్తంగా 12 కట్స్‌ను కన్నప్ప సినిమా నుంచి తొలగించి.. చివరకు 182 నిమిషాలకు రన్ టైం కుదించినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు.. కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ నేటి నుంచి గ్రాండ్ లెవెల్ లో ప్రారంభమవుతున్నాయని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. తెలుగు అభిమానులకు బుధవారం నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. మోహన్ బాబు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూనే.. సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిశాడు.