కన్నడ భాష పై కమల్ సెన్సేషనల్ కామెంట్స్.. రానా రియాక్షన్ ఇదే..!

తాజాగా కమలహాసన్ నటించిన థ‌గ్ లైఫ్‌ సినిమా.. ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష పై కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీంతో కర్ణాటకలో కమల్ హాసన్ నటించిన థ‌గ్ లైఫ్ సినిమా బ్యాన్‌కు దారితీసింది. ఈ పరిణామాలపై రానా.. తాజాగా రియాక్ట్ అయ్యాడు. రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కమల్ హాసన్ గురించి ప్రస్తావన రాగా.. రానా రియాక్ట్ అయ్యాడు.

Rana Naidu 2 Trailer: Arjun Rampal Clashes With Rana Daggubati In This  Netflix Series

ప్రస్తుతం సోషల్ మీడియా ఎవరి అభిప్రాయాలను వాళ్ళు స్వతంత్రంగా వ్యక్తం చేసే వేదికగా మారిపోయిందని.. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. ప్రస్తుతం ప్రతి అంశం రాజకీయం అవుతుంది.. వివాదాస్పదంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే అంశంపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కన్నడ, తమిళ్ భాషలపై ఎలాంటి చర్చ జరుగుతుందో.. నేను ముంబై వచ్చిన కొత్తలో మరాఠీ, బిహారి భాషలపై కూడా అలాంటి చర్చల కొనసాగాయని.. కొందరు అటెన్షన్ కోసం ఇలా చేస్తుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమిళ్ నుంచి కన్నడ భాష పుట్టింది అంటూ కమలహాసన్ చేసిన ఈ కామెంట్స్ పై కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్ ఆఫ్ కామర్స్ అగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Abhishek Banerjee, Rana Daggubati react to row over Kamal Haasan's Kannada  comment: 'Same about Marathi-Bihari…' | Bollywood - Hindustan Times

ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినా.. కమల్ హాసన్ కెఎఫ్‌సిసికి రాసిన లేఖలు మాత్రం తాను క్షమాపణలను చేప్ప‌క‌పోవ‌డం విశేషం. తన సినిమాను కర్ణాటకలో మాత్రం రిలీజ్ చేయనని కమలహాసన్ కోర్టుకు వివరించాడు. ఈ క్రమంలోనే కర్ణాటక మినహా ప్రపంచవ్యాప్తంగా థ‌గ్ లైఫ్‌ సినిమాను నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. దాదాపు 35 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత క‌మ‌ల్ – మ‌ణి ర‌త్నం కాంబోలో వ‌చ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్ర‌జెంట్ మిక్స్డ్ టాక్ ద‌క్కించుకుంది.