బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిషేక్ తన నటనతో సత్తా చాటుకున్నాడు. ఇక మిస్ వరల్డ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకొని.. ఆరాధ్య బచ్చన్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ కలిసి కెమెరాకు స్టిల్స్ ఇచ్చి ఈ వార్తలకు చెక్ పెట్టారు. ఇలాంటి క్రమంలో అభిషేక్ తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్న పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
తను కొన్ని రోజులు అన్నింటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించని అభిషేక్.. బుధవారం రాత్రి ఈ సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడం అందరికి షాక్‌ను కలిగిస్తుంది. తను ఈ పోస్టులో కొన్ని రోజులు అన్నిటికి.. అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నా.. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.. నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళ కోసం ఉన్నదంతా ఇచ్చేసా.. ఇప్పుడు నా కోసం టైం కేటాయించాలనిపిస్తుంది.. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలనిపిస్తోంది అనే సందేశాన్ని పంచుకున్నాడు.
ఇందులో భాగంగానే కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. అందరికీ దూరంగా ఉండాలంటూ ఈ పోస్ట్ కు కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారడంతో.. అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పలువురు.. కొన్ని రోజులు మీరు యాక్టింగ్‌కు విరామం తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తుండగా.. మరికొందరు త్వరలోనే కొత్త అభిషేక్‌ను చూడబోతున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. చివరిగా హౌస్ ఫుల్ 5 సినిమాలో కనిపించిన అభిషేక్.. ప్రస్తుతం రితిష్ దేశ్ ముఖ్ డైరెక్షన్‌లో జెనీలియా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న రాజా శివాజీ సినిమాల్లో మెరవనున్నాడు. ఈ సినిమా చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత గాధ ఆధారంగా రూపొందుతుంది.