కుబేర కోసం రంగంలోకి జక్కన్న.. ఆ స్పీచ్ పైనే హైప్ అంతా..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్‌ కంటెంట్ సైతం.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ధనుష్, నాగార్జున అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్‌ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sekhar Kammula's Kubera - Unexpected Twist! - TeluguBulletin.com

ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మరింత వేగవంతం చేశారు మేకర్స్‌. భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. ఈ నెల‌ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంట్ నేడు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేక‌ర్స్‌. మరి కొద్ది గంటల్లో ప్రారంభమవ‌నున్న‌ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఆడియన్స్ లో ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది, దానికి ప్రధాన కారణం ఎస్ఎస్ రాజమౌళి.

టాలీవుడ్ దర్శక ధీరుడిగా, ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్గా క్రేజ్‌తో దూసుకుపోతున్న జ‌క్క‌న.. కుబేర స్పెషల్ గెస్ట్ గా వస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్పుడు జక్కన్న స్పీచ్ ఎలా ఉండబోతుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ధనుష్, అలాగే నాగార్జునల పై రాజమౌళి ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు.. ఏ విషయాలను షేర్ చేసుకుంటాడు.. అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి జక్కన్న నుంచి ఏ రేంజ్ లో స్పీచ్ ఉండబోతుందో.. సినిమా పై ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేయనున్నాడో వేచి చూడాలి. ఇక డీఎస్పీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.